వర్షం, నిజం, జయం వంటి సినిమాల్లో విలన్ గా నటించి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న హీరో గోపి చంద్. ఆ తర్వాత హీరోగా మారి మంచి సినిమాలు చేసాడు. ఆ సినిమాల్లో అతని నటనతో మాస్ హీరో అనే గుర్తింపు వచ్చింది. అగ్ర దర్శకులు కూడా ఆయనతో సినిమాలు చేసే ప్రయత్నం చేసారు. అయితే కథల ఎంపిక విషయంలో అతను చేసిన తప్పులతో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు.
తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాల్లో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంచితే… గోపి చంద్ తను హీరోగా వచ్చిన తొలి సినిమాలో… తొలి వలపులో నటించిన హీరోయిన్ స్నేహని ప్రేమించారట. ఆమెను షూటింగ్ లో చూసి ప్రేమలో పడిన గోపి చంద్… వన్ సైడ్ లవ్ చేసారట. ప్రేమ వంటి వాటిని నమ్మని గోపిచంద్… స్నేహ విషయంలో మాత్రం ప్రేమలో పడ్డాడు. కాని ఆమెకు అతనిపై ఉన్న అభిప్రాయంతో వెనక్కు తగ్గాడు.
ఒక రోజు స్నేహ స్నేహ గోపీచంద్ ని చూసి ఇతడు నాకు అన్నలా అనిపిస్తున్నాడని… ఇతడి సినిమాలో హీరోయిన్ గా నటించడం ఏంటి అంటూ సినిమా సెట్లో చెప్పడం గోపిచంద్ ని షాక్ కి గురి చేసింది. తను ప్రేమించే విషయాన్ని ఆమెకు చెప్పాలని చూసినా సరే ఆమెకు ఉన్న అభిప్రాయం చూసి వద్దు అనుకున్నాడు. ఆ తర్వాత కెరీర్ మీద ఫోకస్ పెట్టి మంచి సినిమాలు చేసాడు.