అలనాటి సీనియర్ నటి జమున అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. సావిత్రి తర్వాత మహానటిగా అప్పట్లో ఆమె మంచి పేరు సంపాదించారు. దాదాపు అందరు స్టార్ హీరోలతో జమున సినిమాలు చేసారు. 200 పైగా సినిమాల్లో ఆమె హీరోయిన్ గా చేసారంటే ఆమె డిమాండ్ ఏ రేంజ్ లో ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. కర్ణాటకలో పుట్టిన ఆమె ఆ తర్వాత గుంటూరు జిల్లా వచ్చేశారు.
జమున చివరి రోజుల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ అప్పటి విశేషాలను పంచుకుంటూ ఉండేవారు. ఆమెకు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఎవరికి భయపడని వ్యక్తిగా కూడా ఆమె గురించి చెప్తూ ఉంటారు. గుండమ్మ కథ సినిమాకు ముందు ఆమెకు అక్కినేనితో పెద్ద వివాదమే నడిచింది అని కూడా చెప్తూ ఉంటారు. ఇక ఆమె ఒక కోరిక తీరకుండానే మరణించారు అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.
హరనాధ్ తో జమున ప్రేమలో పడి ఎస్వీ రంగారావు గారు ఇచ్చిన వార్నింగ్ తో లెక్చరర్ రమణారావు ను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఒక పాప, బాబు. వాస్తవానికి కుమార్తె స్రవంతిని సినిమాల్లోకి తీసుకురావాలి అనుకున్నారు. స్క్రీన్ మీద హీరోయిన్ గా చూడాలని కాస్త పట్టుబట్టారు. కాని కుమార్తెకు అది నచ్చలేదు. దీనితో జమున చివరి కోరిక తీరలేదు. పలువురు సన్నిహితుల వద్ద ఈ విషయాన్ని చెప్పారట జమున.