సినిమా పరిశ్రమలో జయసుధ, మురళి మోహన్ కు మంచి గుర్తింపు ఉంది. ఏ సినిమా అయినా సరే ఎలాంటి పాత్ర అయినా సరే వీళ్ళు పోషిస్తే ఆ పాత్ర అందంగా ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇక ఆర్ధికంగా కూడా మంచి ప్లానింగ్ తో వీళ్ళు సెటిల్ అయ్యారు అనే చెప్పాలి. వీళ్ళ తరంలో పని చేసిన చాలా మంది ఈ స్థాయిలో లేరు అని అంటూ ఉంటారు. వ్యాపార పరంగా కూడా ఇద్దరూ మంచి స్థాయికి వెళ్ళారు.
వీళ్ళు ఈ స్థాయికి వెళ్ళడానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా నటించడానికి కారణం దాసరి నారాయణరావు అని అంటూ ఉంటారు. ఈ ఇద్దరికీ ఆయనే సలహాలు ఇచ్చేవారు అని అంటారు. మురళి మోహన్ హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ కావడం వెనుక కూడా దాసరి ఉన్నారని అంటారు. ఇప్పుడు మురళీ మోహన్ ఆర్ధికంగా చాలా మంచి స్థాయిలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా ఆస్తులు సంపాదించారు.
ఇక జయసుధ… బాలీవుడ్ కి వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసారు. జయప్రద, శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్ళడంతో తాను కూడా వెళ్ళాలి అని చూసారు. కాని దాసరి వద్దని చెప్పారట. నీకు కలిసి రాదూ అన్నారట. దీనితో జయసుధ వయసుకి తగిన విధంగా పాత్రలు చేస్తూ ఇక్కడే ఉండిపోయారు. ఆర్ధికంగా కూడా జయసుధ మంచి స్థాయిలో ఉన్నారు. ఇక మురళి మోహన్, జయసుధ ఇద్దరూ ఎంపీలుగా పని చేసారు