కన్నడ సినిమా రేంజ్ ని పెంచిన సినిమాల్లో కాంతారా కూడా ఒకటి. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఒటీటీ లో కూడా విడుదల కాగా మంచి స్పందన వస్తుంది. అయితే వరాహ రూపం మ్యూజిక్ విషయంలో చిత్ర యూనిట్ కి షాక్ తగిలింది. దీనితో ఆ మ్యూజిక్ లేకుండానే చిత్ర యూనిట్ సినిమాను విడుదల చేసింది.
అదలా ఉంచితే ఇలాంటి కథతోనే మన తెలుగులో ఒక సినిమా వచ్చింది. రాజమౌళి శిష్యుడు ఒకరు ఆకాశవాణి పేరుతో సినిమాను తెరకెక్కించారు. రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది విడుదల అయింది. ఒటీటీ లో విడుదల చేసిన ఈ సినిమాకు మంచి స్పందన రాలేదు. సినిమా కథ చూస్తే… ప్రపంచానికి దూరంగా అన్నట్టుగా ఒక గ్రామం ఉంటుంది.
ఆ ఊరికి అన్నీ తానై వ్యవహరించే దొర ఉంటాడు. ఇక చెట్టుతొర్రలో ఒక బండరాయి ఉంటే ఆ రాయిని దైవంగా భావించే ప్రజలు పూజలు చేస్తూ ఉంటారు. ఆ దొర తమ జీవితాలను మారుస్తాడు అనే నమ్మకం ఆ ప్రజలకు ఉంటుంది. బయట నుంచి ఆ ఊరికి ఎవరు వచ్చినా దొర చంపేస్తాడు. ఇక ఆ ప్రజల జీవితాలను మార్చడానికి దేవుడు రేడియో రూపంలో వస్తాడు. అక్కడి నుంచి కథ ఆసక్తిగా ఉంటుంది. కాని సినిమాలో నటులు ఎవరికి తెలియకపోవడంతో సినిమా ఆడలేదు.