స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కీరవాణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలకు తన అద్భుతమైన సంగీతాన్ని అందించి ఎన్నో అవార్డులు,రివార్డులు సైతం అందుకున్నారు. అలాంటి కీరవాణి గారి తండ్రి శివ శక్తి దత్త అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన స్క్రీన్ రైటర్ గా.. పెయింటర్ గా.. లిరిసిస్ట్ గా..మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
అయితే అలాంటి శివశక్తి దత్త గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తన గురించి ఎన్నో తెలియని విషయాలు చెప్పుకొచ్చారు. రాజమౌళి హీరో గా బాగుంటాడని కానీ రాజమౌళి కి హీరో అవ్వాలని ఆసక్తి లేదు అని చెప్పాడు. అలాగే రాజమౌళి కుటుంబం ఒకానొక సందర్భంలో కనీసం తినడానికి తిండి కూడా లేకపోయేది. ఆ టైంలో కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవాణి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి ఆ వచ్చిన డబ్బులతోనే కుటుంబం మొత్తాన్ని పోషించేవారు.
అయితే అప్పట్లో వీరు తినడానికి తిండి లేకపోయినా మొదట్లో వీరు మాత్రం చాలా కోటీశ్వరులట.. అయితే శివశక్తి దత్త విజయేంద్ర ప్రసాద్ వీళ్లు ఆరుగురు అన్నదమ్ములట. మొదట్లో శివశక్తి దత్త సినిమా మీద ఉన్న పిచ్చి తో తుంగభద్ర వైపు కుటుంబం మొత్తం వలస వెళ్లారట. ఇక అక్కడ ఆయన తన డబ్బులతో దాదాపు 300 ఎకరాల వరకు భూమిని కొనుగోలు చేశారట.
ఇక ఆ టైంలో ఆయనను చూసి ఎంతోమంది గొప్పగా చెప్పుకునే వారట. అంతేకాదు ఒక రాజుకి జమీందారికి ఎంత పేరు ఉండేదో అంత గుర్తింపు సంపాదించుకున్నారట శివశక్తి దత్త. కానీ ఆయనకు ఉన్న ఆ పిచ్చితో ఉన్నదంతా పోగొట్టుకున్నారట. అదేంటంటే ఆయనకు సినిమాలు అంటే చాలా పిచ్చి..సినిమాల మీద ఉన్న మోజుతో 300 ఎకరాల భూమిని పోగొట్టుకొని, మద్రాస్ లో సెటిల్ అయ్యారట.
అంతేకాదు ఒకానొక టైంలో కనీసం ఇవాళ తిండి ఎలా దొరుకుతుందో రేపు తిండి ఎలా దొరుకుతుందో అని ప్రతిరోజు ఆలోచించేవారట. ఇక అలాంటి టైంలోనే కీరవాణి వారిని పోషించారు అంటూ గతంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజెన్స్ సినిమాల మీద మోజుతో 300 ఎకరాలు అమ్మేస్తారా అంటూ కొంతమంది తిడుతున్నారు. ఇక మరికొంత మందేమో రాజమౌళి కీరవాణి వల్ల మీ కుటుంబం మళ్లీ గొప్ప స్థాయికి వచ్చింది అని కామెంట్లు పెడుతున్నారు.