టాలీవుడ్ లో కీర్తి సురేష్ కు ఒకప్పుడు మంచి డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆమెకు మహానటి సినిమా తర్వాత దాదాపు సౌత్ లో ఉన్న అన్ని భాషల్లో భారీగా పారితోషికం వచ్చింది. ఆ సినిమాల్లో ఆమె పాత్రలు కూడా కాస్త నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే కావడం విశేషం. కెరీర్ మొదటి నుంచి కూడా స్కిన్ షో విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చింది ఈ అమ్మడు.
ఆ తర్వాత మాత్రం ఆమె కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన సర్కారు వారి పాట సినిమా విషయంలో ఆమె స్కిన్ షో చేయాల్సి వచ్చింది. ఆ సినిమా హిట్ అయినా సరే కీర్తికి పెద్దగా అద్రుష్టం కలిసి రాలేదనే మాట వినపడుతుంది. ఇప్పుడు చిన్న హీరోలతో కూడా ఆమె సినిమాలు ప్లాన్ చేస్తుంది. ఇక ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది అని టాక్.
కోటి రూపాయల కంటే ఎక్కువ డిమాండ్ చేయడం లేదని సమాచారం. నానీ తో చేస్తున్న దసరా సినిమా హిట్ అయితే మాత్రం ఆమె కాస్త ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది అని టాక్. ఆఫర్లు వస్తున్నాయి గాని ఆమె డిమాండ్ చేసే పరిస్థితి లేదు. ఒక తమిళ సినిమాకు రెండు కోట్లు అడిగినా తర్వాత కోటిన్నర వరకు తగ్గింది అని సమాచారం. ఏది ఎలా ఉన్నా ఆమె రేంజ్ పడటం మాత్రం ఫాన్స్ కి నచ్చడం లేదు.