ఖడ్గం… ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో 2002లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందూ ముస్లిం ఒక్కటే అని చాటి చెబుతూ భారతదేశ గొప్పతనాన్ని ఈ సినిమాలో కృష్ణవంశీ చూపించారు. ఈ చిత్రం నంది అవార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.
అలాగే సోనాలి బింద్రే, సంగీత హీరోయిన్స్ గా నటించారు. అయితే సోనాలి బింద్రే కొద్దిసేపు మాత్రమే కనిపిస్తుంది. సంగీత మాత్రం పూర్తిస్థాయిలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో తనకి ఇష్టం లేకపోయినా సరే తన తల్లి హీరోయిన్ ను చేయాలనుకుంటుంది. ఆమె బలవంతంతోనే ఒక దర్శకుడి పక్కలోకి కూడా వెళ్తుంది. అయితే ఆ సమయంలో తనని ప్రేమించిన రవితేజ తలుపు తీసి చూస్తూ ఎంతో బాధపడిపోతాడు.
నిజానికి ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితి ఉంటుందట. కృష్ణవంశీ కూడా అందుకే ఆ సీన్ పెట్టారని అప్పట్లో పెద్ద టాక్ నడిచింది. అంతేకాదు అప్పట్లో సీనియర్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ ను టార్గెట్ చేసే క్రమంలోనే కృష్ణవంశీ ఈ సీన్ కావాలని పెట్టారని అంటుంటారు.
అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది… ఆ డైరెక్టర్ ఎవరు ఏంటి అనేది తెలియదు. కానీ ఆ డైరెక్టర్ రమ్య కృష్ణ ను ఓ సినిమా షూటింగ్ లో ఇబ్బంది పెట్టారట. అందుకే ఆయనను టార్గెట్ చేస్తూ ఈ సీన్ క్రియేట్ చేశారట కృష్ణవంశీ.
ALSO READ :విశ్వక్ సేన్ ఇష్యూ ఎఫెక్ట్… ఎవరీ దేవి నాగవల్లి
అలాగే రమ్యకృష్ణ కూడా ఆ తర్వాత మాట్లాడుతూ… స్టార్ హీరోయిన్ గా ఒకరు ఎదగాలంటే తప్పకుండా దర్శకనిర్మాతలకు లొంగి పోవాల్సిందేనని రమ్మన్న గది లోకి వెళ్లాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ ఇష్యూ పెద్ద దుమారం రేపింది.
ALSO READ : దాన వీర శూర కర్ణ బడ్జెట్ కు 15 రెట్లు లాభాలు… లెక్కలు మారాయి!!