సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సర్కారు వారి పాట. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అలాగే తనికెళ్ల భరణి, సముద్రకని, నదియా, సుబ్బరాజు కీలక పాత్రలలో నటించారు. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది.
ఇకపోతే ఈ సినిమాలోని ఒక సన్నివేశం పై నెటిజన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. జనసేనని పవన్ కళ్యాణ్ ను మహేష్ టార్గెట్ చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో ప్రభాస్ శీను లోన్ రికవరీ ఏజెంట్ గా నటించాడు. మరోవైపు తనికెళ్ల భరణి బ్యాంకు లో తీసుకున్న లోన్ కట్టడానికి ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అప్పుడు మహేష్ వాళ్లకు అండగా ఉంటాడు.
చందమామ సినిమాలో అసలు హీరో నేనే…అడవి శేషు
ఆ సమయంలో ప్రభాస్ శీను మహేష్ పై అటాక్ చేయడానికి వచ్చినప్పుడు గాజు గ్లాస్ ని నోట్లో పెట్టి కొడతాడు. అయితే అప్పుడు గ్లాస్ పంపించేయడం ఏంటండి బాబు ఇది ఇప్పుడు బయటకు ఎలా వస్తుంది అని అడుగుతాడు. రికవరీ ఏజెంట్ వి కదరా… రికవరీ చేసేయ్ అంటూ మహేష్ డైలాగ్ చెప్పారు.
అయితే ఈ సన్నివేశం లో గాజు గ్లాస్ ని హైలెట్ చేస్తూ కొంత మంది నెటిజన్లు మహేష్ జనసేనని డైరెక్ట్ గా టార్గెట్ చేశాడు ఉంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే మరో వైపు ఈ సినిమాలో సుబ్బరాజు రింగ్ టోన్ గా భీమ్లా నాయక్ సాంగ్ పెట్టుకుంటాడు. గ్లాస్ విషయం లో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారని అనుకున్నా అక్కడ రింగ్ టోన్ విషయంలో పవన్ ని హైలెట్ చేశారనే చెప్పాలి. ఏదేమైనా గ్లాస్ ని టార్గెట్ చేయడం అనేది కొంతమంది అభిప్రాయం మాత్రమేనని పవన్ ను మహేష్ ఎలాంటి టార్గెట్ చేయలేదని పవన్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
కొరటాల శివ సినిమా హీరోలలో ఫాలో అవుతున్న ఒకే సెంటిమెంట్ ఇది గమనించారా ?