సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య ఏదైనా వార్త వస్తే చాలు దాని గురించి మీడియాలో ఎక్కువగా హడావుడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తే అప్పుడు మీడియాలో దీని గురించి ఎన్నో వార్తలు వచ్చేవి. ఇందులో కొన్ని నిజాలు ఉండేవి కొన్ని అబద్దాలు ఉండేవి. ఇప్పటి మాదిరిగా అప్పుడు చిల్లరగా వార్తలు ఉండేవి కాదు. దీనితో ఎక్కువగా ఇబ్బందులు ఉండేవి కాదు అనే చెప్పాలి.
ఇలా అప్పట్లో మురళి మోహన్ – జయ చిత్ర గురించి కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. వీళ్ళు ఇద్దరూ కలిసి హీరో, హీరోయిన్లుగా చాలా సినిమాల్లో కలిసి నటించారు. అలాగే కాస్త సన్నిహితంగా ఉండేవారు. మురళి మోహన్ కు కాస్త మొహమాటం ఎక్కువగా ఉండటంతో… ఆయన డైలాగులు చెప్పడంతో కాస్త కంగారు పడతారు. దీనితో దాసరి సినిమా షూట్ కి ముందు హీరో హీరోయిన్ ఇద్దరికీ డైలాగులు ఇచ్చేవారు.
ప్రిపేర్ కావాలి అని చెప్పడంతో జయ చిత్ర, మురళి మోహన్ ఇద్దరూ కూర్చుని ప్రిపేర్ అయ్యేవారు. ఇది అప్పట్లో బాగా బయటకు వచ్చింది. మీడియా కూడా హడావుడి చేసేసింది. వీళ్ళు ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే వార్తలు అప్పట్లో బాగా వచ్చాయి. మురళి మోహన్ వాటిని చూసి షాక్ అయి… ఇదేంటి నాకు పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్నారు కదా… అని అన్నారట. కాని ఇది వివాదం కాకుండానే సమసిపోయింది.