అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కు, ఎన్టీఆర్ కు మధ్య విభేదాలు ఉండేవి అనే వార్తలు మనం వింటూనే ఉంటాం. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు బాగా నడిచింది అంటారు. కృష్ణ ఎన్టీఆర్ ను ఎదుర్కొనేందుకు కొందరు హీరోయిన్లను కూడా ముందుగానే తన సినిమాలకు అడ్వాన్స్ ఇచ్చి తీసుకునేవారు. ఇది ఎన్టీఆర్ లో ఆగ్రహానికి కారణం అని అంటారు కొందరు. అయితే ఇద్దరి మధ్య విబేధాలు లేవు అనే వాళ్ళు కూడా ఉన్నారు.
ఇక బాలకృష్ణ చేసిన సాహస సామ్రాట్ అనే సినిమా సమయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని అంటారు. బాలయ్య – విజయశాంతి కాంబినేషన్ లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాహస సామ్రాట్ వచ్చింది. 1987 లో విడుదలైన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతం అందించారు. అయితే అదే టైటిల్ తో తన కుమారుడు రమేష్ బాబు హీరోగా ఒక సినిమా చేయాలని భావించారు కృష్ణ.
సామ్రాట్ అనే టైటిల్ హక్కులు ఆయనకు ఉన్నాయి. అయినా సరే సినిమా నిర్మాత అంగీకరించలేదు. బాలకృష్ణ సినిమాకు అదే టైటిల్ కావాలని పట్టుబట్టారు. అప్పటికే రమేష్ బాబు సినిమా కూడా మొదలయింది. అయినా సరే తగ్గలేదు… ఎన్టీఆర్ వద్దకు వెళ్తే ఆయన కూడా రాఘవేంద్ర రావు కి మద్దతు ఇచ్చారట. ఈ రెండు సినిమాలు అప్పుడు సామ్రాట్ అనే టైటిల్ తోనే ముందుకు వెళ్ళాయి. ఆ తర్వాత బాలకృష్ణ సినిమా నిర్మాత కాస్త తగ్గి సాహస సామ్రాట్ అనే టైటిల్ పెట్టారు. కాగా ఆ రెండు సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.