తెలుగు సినిమా అంటే ఎన్టీఆర్ అనే స్థాయిలో ఒకప్పుడు తన ముద్ర వేసారు ఆయన. ఇక ఆర్ధికంగా కూడా ఆయన తీసుకున్న జాగ్రత్తలు సినిమా పరిశ్రమలో ఎందరికో ఆదర్శంగా నిలిచాయి అని చెప్తారు. తన సినిమాల్లో నటించిన నటులకు ఆయన అండగా నిలబడినా ఆర్ధిక సహాయాలు చేసే విషయంలో మాత్రం వెనకడుగు వేసే వారు. సినిమా ఫ్లాప్ అయితే నష్టాలను ఎన్టీఆర్ భరించే వారు అని అంటారు.
ఇక ఇదిలా ఉంచితే అలనాటి ప్రముఖ నటుడు గుమ్మడి రాసిన పుస్తకంలో ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. ఎన్టీఆర్… తన సోదరుడు త్రివిక్రమ రావు విషయంలో ఎన్నో సమస్యలు ఎదుకొన్నారు అని ఆయన తన పుస్తకంలో రాసారు. ఎన్టీఆర్ స్వయంగా త్రివిక్రమ రావుని సినిమాల్లోకి తీసుకొచ్చి నటుడు చేయాలని చూసినా దర్శకుడు కేవీ రెడ్డి సూచనలతో.. టెక్నికల్ ఫీల్డ్‌కు పరిమితం చేయడం జరిగింది.
అక్కడి నుంచి ఎన్టీఆర్ సహకారంతో నిర్మాత అయ్యారు. ముందు బాగానే ఉన్నా సరే కొందరు నటులను పెట్టి సినిమాలు తీసి త్రివిక్రమరావు భారీగా నష్టపోయారు. దీనితో ఆయన్ను నష్టాల నుంచి బయటకు తీసుకు రావడానికి ఎన్ ఏటీ కంబైన్స్‌ను కూడా విక్రయించేశారని ప్రస్తావించారు గుమ్మడి. ఇక ఆ తర్వాత తన తమ్ముడి కోసం రెండు మంచి సినిమాలు చేసారు ఎన్టీఆర్. అలాగే చెన్నై దగ్గర తన తమ్ముడి పేరిట ఆస్తులు కూడా ఎన్టీఆర్ కొన్నారట