బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరిగింది అనే విషయం అందరికి తెలిసిందే. ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ప్రభాస్ కు కాస్త ప్రతికూల వాతావరణం నడుస్తుంది. బాహుబలి సినిమా హిట్ అయింది గాని ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు అనుకున్న విధంగా ఫలితాన్ని ఇవ్వలేదు. దీనితో ఆది పురుష సినిమా కోసం ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా కోసం ప్రభాస్ ఎక్కువగానే కష్టపడుతున్నాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రవుత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతికి సినిమా విడుదల ఉంటుంది అని భావించినా సినిమాను జూన్ లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. ఇక దీనికి సంబంధించి వచ్చిన టీజర్ ఫాన్స్ కి నచ్చలేదు అనే టాక్ కూడా వినపడింది. ప్రభాస్ రేంజ్ కి ఏ మాత్రం సెట్ కాలేదని అన్నారు.
ఇక విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ పై కూడా భారీ విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంచితే ఈ సినిమా కోసం ప్రభాస్ కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా భారీ డైలాగ్ చెప్పారని టాక్. ఆయన ఏకంగా రెండు పేజీల డైలాగ్ ను చెప్పారని దీని కోసం మూడు టేక్ లు తీసుకున్నారని టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఏప్రిల్ నుంచి మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.