బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఎలా పెరిగింది అనే విషయం అందరికి తెలిసిందే. ఆయనతో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్ దర్శకులు సైతం సిద్దంగా ఉన్నారు. ఆ సినిమాకి ఎంత పేరు వచ్చిందో అంత కంటే ఎక్కువ ప్రభాస్ కి ఇమేజ్ పెరిగింది. అయితే వరుసగా రెండు ఫ్లాప్ సినిమాలతో ప్రభాస్ ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు ఆదిపురుష్ సినిమా ద్వారా ఫాం లోకి రావాలని చూస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న సలార్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించి ప్రస్తుతం సీరియస్ గా ఉన్న ప్రభాస్ గురించి ఈ మధ్య పెళ్లి వార్తలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమిళ స్టార్ హీరో సూర్య కోసం ప్రభాస్ వెయిట్ చేసాడట. అసలు ఆ మేటర్ ఏంటో చూద్దాం.
దీనికి సంబంధించి సూర్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… నేను, ప్రభాస్, హైదరాబాద్ లో ఒకటే లొకేషన్ లో షూటింగ్ చేసామని… కలిసినప్పుడు రాత్రి కలిసి భోజనం చేద్దామని ప్రభాస్ నాతో అన్నాడని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు నా కోసం వెయిట్ చేస్తానని చెప్పాడని కాని… సాయంత్రం 6లోపు అయిపోతుందనుకున్నా, నా షూటింగ్ కాస్త రాత్రి 11:30 అయిపోయిందని వివరించాడు.
ఇక ప్రభాస్ ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఏదైనా హోటల్, ప్రొడక్షన్ మెస్ లో తినేద్దాం అనుకున్నానని తర్వాతి రోజు ప్రభాస్ ని కలిసి సారీ చెప్పేద్దామనుకున్నాడట. అయితే నేను షూటింగ్ ముగించుకుని కారిడార్ లో నడుస్తుండగా ప్రభాస్ పిలిచాడని… సర్ నేను రెడీ, మీరు స్నానం చేసి వస్తే భోజనం చేద్దాం అని అన్నాడని వివరించాడు. తన ఇంటి నుంచి ప్రభాస్ బిర్యానీ తెప్పించాడని, ప్రభాస్ వాళ్ల అమ్మ చేసిన ఆ బిర్యానీ అయితే చాలా బాగుంది అంటూ తనకు రుచి చూపించాడు అని సూర్య అప్పుడు జరిగింది వివరించాడు.