సినిమా షూటింగ్ లకు ఆలస్యం రావడం అనేది తలనొప్పి వ్యవహారం అనే మాట వాస్తవం. చాలా మంది నటులు ఈ విషయంలో క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు. హీరో రాజశేఖర్ కూడా ఈ జాబితాలోకే వస్తారు అంటున్నారు డైరెక్టర్ ఎన్ శంకర్. రాజశేఖర్ తో ఆయుధం అనే పేరుతో ఒక సినిమా చేసారు శంకర్. ఈ సినిమా షూటింగ్ రాజశేఖర్ చాలా సార్లు ఆలస్యంగా వచ్చేవారట. అనేకసార్లు ఇబ్బంది పడినట్టుగా శంకర్ స్వయంగా చెప్పారు.
మొదట్లో ఉదయం 10 గంటలకు వచ్చిన రాజశేఖర్ ఆ తర్వాత ఎప్పుడు వస్తారో కూడా తెలియదట. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు అలాగే సాయంత్రం 5 గంటలకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు ఎంతో మంది పెద్ద నటులు ఆ సినిమా కోసం డేట్స్ తీసుకుంటే రాజశేఖర్ వల్ల అంతా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయట. ఒకరోజు రాజశేఖర్ ని కూర్చోబెట్టి మీ సమయం కచ్చితంగా చెప్తే అదే సమయంలో షూటింగ్ అరేంజ్ చేస్తానని శంకర్ చెప్పారు.
మీరు పొద్దున పదింటికి వస్తే ఆ రోజు అంతా చాలా వివరంగా సన్నివేశాలన్ని తీస్తానని లేదంటే ఒకవేళ మీరు మధ్యాహ్నం రెండింటికి వస్తే మూడు ముక్కల్లో ఆ సీన్స్ ని పూర్తి చేస్తానని అన్నారట. అలా కాకుండా ఇంకా ఆలస్యంగా వస్తే ఆ రోజు చేయాల్సిన షూట్ మొత్తం పూర్తి చేస్తానని ఎలా చేయాలో మీరే చెప్పాలి అని అడిగారట. దీనితో రాజశేఖర్ కాస్త ఆలోచించుకుని తప్పు తెలుసుకుని త్వరగా వచ్చారట.