ఇండియన్ సినిమాలో రజనీ కాంత్ కి ఉన్న ఫేం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రజనీ కాంత్ పేరు వింటే చాలు ఫాన్స్ కి పూనకాలు వస్తాయి. ఆయన సినిమాలు చూడటానికి సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సైతం సెలవలు పెట్టె పరిస్థితి ఉంటుంది అనే మాట వాస్తవం. ఇక ఆయన కెరీర్ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం భార్య లతా అని అంటారు. ఆమె గురించి రజనీ కాంత్ తాజాగా పలు విషయాలు చెప్పారు.
లతను నాకు పరిచయం చేసిన స్నేహితుడు మహేంద్రన్ కు, లతకు శుభాకాంక్షలు అని అన్నారు రజనీకాంత్. లైఫ్ లాంగ్ వీళ్లిద్దరికీ రుణపడి ఉంటానని చెప్పారు ఆయన. లత నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ లో చాలా మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చారు. లతను చూసి నేను క్రమశిక్షణ నేర్చుకున్నానని రజనీకాంత్ చెప్పడం విశేషం. బస్ కండక్టర్ గా పని చేసే సమయంలో కాస్త ఎక్కువ కష్టపడ్డాను అని అన్నారు.
ఆ సమయంలో నేను సిగరెట్ తాగేవాడినని మాంసం ఎక్కువగా తినేవాడినని ఆయన తెలిపారు. ఈ అలవాట్లు ఆరోగ్యానికి మంచివి కావని రజనీకాంత్ తెలిపారు. పెళ్లైన తర్వాత నా భార్య తన లవ్ తో ఈ అలవాట్లకు దూరం చేసిందని అన్నారు. నా భార్య లత వల్లే ప్రస్తుతం ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నానని తెలిపారు. రజనీ కాంత్ ఇప్పుడు మూడు సినిమాలను లైన్ లో పెట్టారు.