సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలకు ఉండే స్నేహాల గురించి మనం వింటూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ కు మధ్య మంచి స్నేహం ఉంటుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కు రాజీవ్ కనకాల, కొడాలి నానీ వంటి వారితో మంచి అనుబంధం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కు ముందు నుంచి వీళ్ళు ఎక్కువగా సపోర్ట్ చేసారని అందుకే వాళ్ళ మీద ఎక్కువ అభిమానం ఉంటుంది అని టాలీవుడ్ లో టాక్.
ముఖ్యంగా రాజీవ్ కనకాల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ సన్నిహితంగా ఉంటారని మనం వింటూ ఉంటాం. అయితే వీళ్ళ మధ్య మొదట్లో బాగా గొడవలు జరిగేవి అని అంటారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నం 1 సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటుగా రాజీవ్ కనకాల కూడా నటించాడు. ఈ సినిమాకు అప్పట్లో మంచి వసూళ్లు వచ్చాయి.
అయితే షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ బాగా టీజ్ చేసేవాడు రాజీవ్ కనకాలను. దీనితో ఇద్దరి మధ్య సరదాగా గొడవలు కూడా జరిగేవి. దీనితో రాజీవ్ షూట్ నుంచి కూడా వెళ్లిపోవాలి అనుకున్న సందర్భాలు ఉన్నాయట. కాని రాజమౌళి ఒప్పించి ఉంచేవారట. ఈ విషయాలను స్వయంగా రాజీవ్ కనకాల చెప్పాడు. ఆ తర్వాత నుంచి తమ స్నేహం బాగా బలపడిందని… మంచి స్నేహితులు అయ్యామని చెప్తూ ఉంటాడు.