ఇప్పుడు మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ కి క్రేజ్ ఒక రేంజ్ లో పెరుగుతున్న మాట వాస్తవం. ఈ ఇద్దరూ పాన్ ఇండియా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు అనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్… శంకర్ తో ఒక సినిమా ప్లాన్ చేసాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. అల్లు అర్జున్… పుష్ప మొదటి పార్ట్ విజయంతో మంచి ఊపు మీద ఉన్నాడు.
ఇప్పుడు పుష్ప రెండో పార్ట్ షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్నాడు. వచ్చే ఏడాది లేదా ఈ ఏడాది చివర్లో పుష్ప రెండో పార్ట్ విడుదల కానుంది. ఇక శంకర్ తో సినిమా తర్వాత రామ్ చరణ్… త్రివిక్రమ్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంచితే అల్లు అర్జున్ చేయాల్సిన హిట్ సినిమా రామ్ చరణ్ చేసాడు ఒకటి.
ఆ సినిమా ఏంటీ అనేది ఒకసారి చూస్తే… నాయక్. ఈ సినిమా దర్శకుడు వీవీ వినాయక్ ముందు బద్రీనాథ్ అనే సినిమాను అల్లు అర్జున్ తో చేసాడు. ఆ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. దీనితో నాయక్ సినిమా కథ చెప్పినా అల్లు అర్జున్ వద్దని చెప్పేసాడు. ఏం చేయాలో అర్ధం కాక ఆ కథను రామ్ చరణ్ కు చెప్తే రామ్ చరణ్ ఓకే చేయడంతో సినిమా ముందుకు వెళ్లి మంచి హిట్ అయింది.