టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ఉన్నా సరే ఎక్కువగా కష్టపడే నటుల్లో రానా ముందు వరుసలో ఉంటాడు అనే మాట వాస్తవం. ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ ఏదొకటి చేస్తూ ఉంటాడు. తాత, తండ్రి పెద్ద నిర్మాతలు అయినా సరే ఎక్కడా కూడా ఆ అహం చూపించకుండా సినిమాలు చేస్తూ ఉంటాడు ఈ హీరో. అన్ని రకాల పాత్రలు చేస్తూ హోస్ట్ గా కూడా కనపడుతూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.
తాత రామానాయుడు అంటే ఈ హీరోకి చాలా ఇష్టం. రానా పూర్తి పేరు కూడా రామానాయుడు. అసలు రానాకి ఆ పేరు ఎలా పెట్టారో ఒకసారి తెలుసుకుందాం. రానా పుట్టినప్పుడు ఎలాంటి పేరు పెట్టాలి అనే దాని మీద రానా తల్లి… దగ్గుబాటి లక్ష్మీ కాస్త ఎక్కువగానే కసరత్తు చేసారు. అన్నీ చూసుకుని సిద్దార్థ్ అనే పేరు పెట్టాలని అనుకున్నారు. సురేష్ బాబుకి కూడా అదే విషయం చెప్తే ఆయన కూడా ఓకే అన్నారు.
కాని బారసాల రోజున మాత్రం సురేష్ బాబు… బియ్యంలో రామానాయుడు అనే పేరు రాయించారు. ఇక ఆ పేరు ఫైనల్ అయిపోయింది. ఎవరు ఏం అనుకున్నా సరే తాను రానాకి తన తండ్రి పేరే పెడతా అని సురేష్ బాబు చెప్పారట. అయితే రానా ఫ్రెండ్ ఒకరు… రామానాయుడు అని పిలవడం కష్టంగా ఉందని కాబట్టి తాను రానా అని పిలుస్తా అన్నారట. అంటే రామా నాయుడు లో మొదటి అక్షరాలు. చివరికి ఆ పేరే ఫైనల్ అయిపోయింది.