బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. రణబీర్ కపూర్‌తో సెల్పీ తీసుకునేందుకు ఓ అభిమాని ఆయన దగ్గరకు వెళ్లారు. దీంతో సెల్ఫీ తీసుకునేందుకు ఆ అభిమానికి రణబీర్ అవకాశం కూడా కల్పించారు.
ఫోన్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందో తెలియదు కానీ సెల్ఫీ తీసేందుకు ఆ అభిమాని తంటాలు పడ్డాడు. మొత్తం నాలుగు సార్లు సెల్ఫీ తీసేందుకు అభిమాని ప్రయత్నించాడు. అన్ని సార్లు ఫోటోకు స్మైల్ ఇస్తూ రణబీర్ కనిపించారు. కానీ అభిమాని ఫోటో తీయలేకపోయాడు.
ఈ క్రమంలో మరోసారి సెల్పీ తీసేందుకు అభిమాని ట్రై చేశాడు. రణబీర్ అసహనానికి గురయ్యాడు. వెంటనే అభిమాని చేతిలో నుంచి ఫోన్‌ను లాక్కొని విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో రణబీర్ పై నెటిజన్లు మండిపడుతున్నారు.
స్టార్ హీరో అయినంత మాత్రాన అలా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది ఇలా వుంటే ఆ వీడియో స్మార్ట్‌ఫోన్ కంపెనీ ప్రమోషన్ కోసం చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఒప్పో సంస్థ తమ ఫోన్ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఇలా క్రియేటివ్‌గా యాడ్ ను డిజైన్ చేసింది.
అభిమాని ఫోన్‌ను విసిరేసిన తర్వాత అతనికి రణబీర్ ఒప్పో ఫోన్ ను గిఫ్ట్ గా ఇస్తాడు. అయితే యాడ్ లోని కొంత భాగాన్ని ఇలా కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది. ఇది తెలియక చాలా మంది నెటిజన్లు రణబీర్ ను ట్రోల్ చేస్తున్నారు.