టాలీవుడ్ లో కొందరు హీరోయిన్ లు ఈ మధ్య కాలంలో సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతో ఫేమస్ అవుతున్నారు. అందులో రష్మిక కూడా ఒకరు. ఆమె ప్రస్తుతం మాల్దీవులకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం విజయ్ దేవరకొండ తో ఆమె వెళ్ళింది అని, అక్కడే ఇద్దరూ ఉన్నారని అంటున్నారు. దీనిపై క్లారిటీ లేదు గాని ఇద్దరూ ముంబై విమానాశ్రయంలో కనపడటం హాట్ టాపిక్ అయింది.
ఇదిలా ఉంచితే… ఇప్పుడు ఫిలిం ఫేర్ అవార్డుల సందడి కొనసాగుతుంది. ఇందులో పుష్ప సినిమాకు చాలానే అవార్డులు వచ్చాయి. అల్లు అర్జున్ పక్కన నటించిన కేశవకు కూడా అవార్డు ఇచ్చారు. అయితే రష్మిక మంధన విషయంలో అన్యాయం జరిగింది అనే కామెంట్ ఉంది. ఈ అవార్డుల కార్యక్రమానికి ముందు ఆమె మాల్దీవులకు వెళ్ళింది. మరి అవార్డు వస్తే ఎవరు తీసుకుంటారు అని అందరూ అనుకున్నారు.
ఉత్తమ నటిగా సాయి పల్లవికి వచ్చింది. పుష్పలో శ్రీవల్లి పాత్ర చేసిన ఆమెకు ఏ అవార్డు రాకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఇదంతా ముందే ఆమెకు లీక్ అయిందని… అందుకే వెళ్లిపోయింది అంటున్నారు. తన క్లోజ్ ఫ్రెండ్స్ తో అక్కడికి వెళ్ళింది అనే మాట వినపడుతుంది. మరి ఈ వార్తలపై ఆమె ఏమంటుందో చూడాలి.