రవితేజా కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో ఖడ్గం ఒకటి. స్వాతంత్ర్య దినోత్సవం గాని దేశానికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా గాని టీవీ లో ఆ సినిమా వస్తుంది. ఆ సినిమాలో దాదాపుగా ప్రతీ ఒక్కరి నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా రవితేజా, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ వాళ్ళ పాత్రలకు న్యాయం చేసారు. వాళ్ళు కాకుండా ఎవరు చేసినా సరే సినిమా ఆ రేంజ్ లో ఉండదు అనేలా చేసారు.
రవితేజా చంటి అనే పాత్రలో చాలా బాగా నటించాడు. ఇక శ్రీకాంత్ కూడా అలాగే పోలీస్ ఆఫీసర్ పాత్రతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత రవితేజా కెరీర్ స్పీడ్ అందుకుంది అని చెప్పాలి. ఇదిలా ఉంచితే ఈ సినిమాలో చంటి పాత్ర చేయడానికి రవితేజ ముందు నో అన్నారట డైరెక్టర్ కృష్ణ వంశీతో. చంటి క్యారెక్టర్ బాగుంది గాని పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయాలని ఉందని అన్నాడు రవితేజ.
కాని కృష్ణ వంశీ మాత్రం చంటి పాత్ర నువ్వు మాత్రమే చేయగలరు అని చెప్పి ఒప్పించారు. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఎవరిని తీసుకుంటున్నారు అని అడిగితే శ్రీకాంత్ ని అని చెప్పడంతో రవితేజాకి నచ్చలేదు. దీనితో మరొకరిని తీసుకోవాలని అప్పుడు తానే సినిమాకు నిర్మాత అవుతాను అన్నాడట. కాని కృష్ణ వంశీ అందుకు నో చెప్పి సీరియస్ అయ్యారట. దీనితో రవితేజా సైలెంట్ అయ్యాడట.