మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాకు మంచి స్పందన వస్తుంది. వరుసగా రెండు ఫ్లాపుల తర్వాత చిరంజీవి చేసిన ఈ సినిమాపై అభిమానులతో పాటుగా చిరంజీవి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మలయాళం రీమేక్ సినిమా అయినా గాడ్ ఫాదర్ కథలో పెద్దగా ఏ మార్పులు చేయలేదు దర్శకుడు. ఇక ఈ సినిమా వసూళ్లు కూడా భారీగానే ఉన్నాయి.
దసరా కానుకగా వచ్చిన ఈ సినిమాలో నయనతారతో పాటుగా సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. ఇక మురళీ శర్మ, షియాజీ షిండే పాత్రలు బాగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంచితే… ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్రపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ పాత్రకు సల్మాన్ న్యాయం చేయలేదని కొందరు అంటే సల్మాన్ ఉండటంతోనే పాన్ ఇండియా లెవెల్ లో సినిమా పాపులర్ అయిందని కొందరు అంటున్నారు.
ఇక ఆ పాత్రకు పవన్ కళ్యాణ్ అయితే చాలా బాగుండేది అనే భావన కూడా ఉంది. అయితే ఆ పాత్రకు సల్మాన్ ఎంత తీసుకున్నాడు అనే దానిపై చాలా చర్చలు జరుగుతున్నాయి. సినిమా సక్సెస్ మీట్ లో సల్మాన్ రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు చిరంజీవి. సల్మాన్ ఖాన్ కి పారితోషికం ఇచ్చి మేనేజర్ తో పంపించడం జరిగిందని… రూమ్ లోకి వెళ్ళిన మేనేజర్ ని సల్మాన్ ఖాన్ బూతులు తిడుతూ నేను చిరంజీవి గారి కోసం ఈ సినిమా చేశాను, పారితోషికం అక్కర్లేదు అని తిప్పి పంపించారు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.