ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు అంటే అన్ని సినిమాలు చేసేవారు. ఇప్పుడు గ్లామర్ మినహా ఏ పాత్ర చేయడానికి కూడా ఆసక్తి చూపించడం లేదనే చెప్పాలి. అగ్ర హీరోయిన్ అనే హోదా వస్తే చాలు డైరెక్టర్ ను నిర్మాతను అవసరం అయితే హీరోని కూడా డామినేట్ చేసే వరకు వెళ్తున్నారు. ఇక గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. హీరోయిన్లు అంటే ఏ పాత్ర అయినా సరే చేయడానికి వెనకడుగు వేసేవారు కాదు.
ఇక కొంతమంది హీరోయిన్లు మాత్రం కాస్త గడుసుగా ఉండి కెరీర్ లో మంచి పాత్రలు పోగొట్టుకున్నారు. అందులో భానుమతి ఒకరు అని చెప్పాలి. అగ్ర హీరోలు అందరితో సినిమాలు చేసిన భానుమతికి కాస్త గడుసుతనం ఎక్కువ. అందుకే ఆమె పెద్దగా ఎవరితో మాట్లాడేవారు కాదు. సెట్ లోకి వెళ్తే సైలెంట్ గా ఉండటం తన పాత్ర ఉంటే చేసి బయటకు రావడం చేసేవారు. ఇక రోమాన్స్ ఉండే పాత్రలు అయితే చేసేవారు కాదు.
కాని సావిత్రి ఏ పాత్రలో అయినా సరే ఒదిగిపోయేవారు. అలా తనకు వచ్చిన ప్రతీ పాత్రకు న్యాయం చేసేవారు. భానుమతి స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ ఉన్నా, మంచి అందం, అభినయం నటన ఉన్నా సరే సావిత్రికే ఇమేజ్ ఎక్కువ రావడానికి కారణం అదే అంటారు. ఇక రోమాన్స్ పాత్రలు చేయాలి అంటే కచ్చితంగా తాను చేసేది లేదని చెప్పేవారు భానుమతి. అందుకనే భానుమతి చేయాల్సిన పది హిట్ సినిమాలను సావిత్రి చేసేసారు.