ఇప్పుడు అంటే హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండటం లేదు గాని ఒకప్పుడు హీరోయిన్లకు చాలా మంచి డిమాండ్ ఉండేది అనే మాట వాస్తవం. అగ్ర హీరోయిన్లకు ఉండే ఇమేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా మంది స్టార్ హీరోయిన్లకు అభిమాన సంఘాలు కూడా దేశ వ్యాప్తంగా ఉండేవి. మన తెలుగులో ఈ ట్రెండ్ సావిత్రి నుంచి మొదలయింది అని చెప్తూ ఉంటారు సినిమా జనాలు.
సావిత్రి సినిమాలకు ఎంతో క్రేజ్ ఉండటంతో అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసేవి. ఈ అభిమాన సంఘాలు ఏకంగా ఎన్టీఆర్ ను కూడా టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అంటారు. ఎన్టీఆర్ అభిమాన సంఘాలకు పోటీగా సావిత్రి అభిమాన సంఘాలను ప్రోత్సహించే వారు అని… ఎన్టీఆర్ సావిత్రి సినిమా విడుదల అవుతుంటే పోటా పోటీగా హడావుడి ఉండేది అని చెప్తూ ఉంటారు.
ఇక అభిమాన సంఘాల పేరుతో ఎవరైనా వస్తే సావిత్రి మోసపోయిన సందర్భాలు ఉన్నాయట. ఆమె ఎవరైనా వస్తే కచ్చితంగా 50 వేలకు తగ్గకుండా ఇచ్చే వారు. ఇక ఎన్టీఆర్ ను కూడా అభిమాన సంఘాల పేరుతో ఎవరైనా అడిగితే ఆయన తన సోదరుడి ద్వారా నిజా నిజాలు తెలుసుకుని డబ్బులు ఇచ్చే వారు. అభిమాన సంఘాల విషయంలో సావిత్రి సానుకూలంగా ఉండేవారు అని ఎవరైనా వస్తే ఆ డబ్బులు ఎవరికి అయినా సాయంగా ఉంటాయని భావించేవారట.