బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్ల రూపాయల ఆస్తులతో ఇండియా లోనే ధనిక హీరోగా ఆయన క్రేజ్ సంపాదించారు. సినిమాలే కాకుండా వ్యాపారాల్లో కూడా ధైర్యంగా పెట్టుబడులు పెడుతూ ఉంటాడు షారుఖ్ ఖాన్. ఇటీవల వచ్చిన పఠాన్ సినిమా మంచి హిట్ కొట్టింది. ఈ సినిమాతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది అనే చెప్పాలి.
ఇక షారుఖ్ ఖాన్ కాస్త లగ్జరీగా బ్రతుకుతూ ఉంటాడు అని అంటారు. ఆయన ఇంటి గురించి తెలిసిన వాళ్ళు కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. మన్నత్ అనే పేరు పెట్టారు ఆ ఇంటికి షారుఖ్. షారుక్ 1998లో ఎస్ బాస్ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా ఈ ఇంటిని చూసి కొన్నారు. అప్పుడే ఇంటిని సొంతం చేసుకోవాలని ఆయన పట్టుబట్టి అడుగులు వేసారు. ఈ ఇంటిని సరిగా మూడేళ్ళకు కొన్నారట.
2001లోనే భారీ ధరకు కొన్నారు షారుఖ్. అప్పట్లోనే ఈ ఇంటి కోసం 13 కోట్లను ఖర్చు చేసారు ఆయన. ఈ ఇంటి కోసం ఆయన భార్య గౌరీ ఖాన్ బాగా కష్టపడ్డారు. స్పెషల్ గా ఇంటీరియర్ డిజైన్ చేయించారు. ఈ ఇంటిని చూస్తేనే మంచి అనుభూతి కలుగుతుంది. ముందు జిన్నత్ అనే పేరు పెట్టినా ఆ తర్వాత మార్చి మన్నత్ అని పెట్టారు. ముందు ఈ ఇంటిని సల్మాన్ చూసినా… వద్దు అన్నారట. ఇప్పుడు 200 కోట్లకు పైగానే ఉంది ఈ ఇంటి ధర.