బాహుబలి సినిమా అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పాత్ర శివగామి. ప్రభాస్ పాత్ర కంటే కూడా ఆ పాత్రే పవర్ ఫుల్ గా కనపడింది. ఆ పాత్ర చేసిన రమ్యకృష్ణకు ఫుల్ మార్కులు పడ్డాయి. కొన్ని సన్నివేశాల్లో ఆమె హావభావాలు అన్నీ కూడా ఆసక్తిని పెంచాయి. ఫాన్స్ శివగామి ని చూసి ఊగిపోయారు. మొదటి భాగం ఇంటర్వెల్ తర్వాత ఆమె కారణంగానే సినిమాకు హైప్ వచ్చింది.
రెండో భాగంలో కూడా ఆమె బాగా ఆకట్టుకుంది. ముందు ఆ పాత్ర కోసం రాజమౌళి చాలానే వర్క్ చేసి శ్రీదేవిని ఎంపిక చేయాలని చూసారు. ఆమె భారీగా డిమాండ్ చేయడంతో వెనకడుగు వేసారు. ఆ తర్వాత రమ్యకృష్ణను ఫైనల్ చేసి ఆ పాత్రకు మరింత అందం తెచ్చారు. శ్రీదేవి అయితే పాత్ర అంత పవర్ ఫుల్ గా ఉండేది కాదనే మాట ఉంది. అయితే రమ్యకృష్ణ కంటే ముందు మరో మాజీ హీరోయిన్ కూడా ఆ పాత్రలో చేయాలి అనుకున్నారు.
ఆమె పేరే జయ చిత్ర. చాలా కాలం తర్వాత పొన్నియన్ సెల్వన్ సినిమా ద్వారా ఆమె ప్రేక్షకులను అలరించారు. తెలుగు బుల్లితెరపై ప్రసారమైన మంగమ్మగారి మనవడు అనే సీరియల్ ఆమెకు నటించే ఛాన్స్ వచ్చినా మిస్ అయింది. అయితే తనకు ఆ అవకాశం రాకుండా… కొందరు అడ్డు పడ్డారు అని… ఉద్దేశపూర్వకంగా తనకు ఈ సీరియల్ లో నటించడం ఇష్టం లేదని కొందరు చెప్పారని ఆమె వాపోయారు.
అలా ఈ సీరియల్లో నటించే అవకాశం చేజారిపోయిందని ఇటీవల ఆమె కామెంట్ చేసారు. ఈ సీరియల్ కు డైరెక్టర్ గా రాఘవేంద్రరావు బంధువులు వ్యవహరించగా… రాజమౌళి గారి గెస్ట్ హౌస్ లో ఉంటూ ఈ సీరియల్ చేయడానికి తాను ఒప్పుకున్నా సరే… మధ్యలో లేనిపోని ఊహగానాలతో నాకు ఈ అవకాశం రాకుండా చేశారని అన్నారు. ఆ సీరియల్ లో తన పాత్ర పవర్ ఫుల్ అని… అక్కడ నటించి ఉంటే శివగామి ఛాన్స్ వచ్చేది అని వాపోయారు.