ఈ తరానికి సౌందర్య అంటే పెద్దగా ఎవరికి తెలియదు గాని అప్పట్లో సౌందర్య అంటే అన్ని వర్గాల్లో మంచి క్రేజ్ ఉండేది. యూత్ లోనే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఉండేది అప్పట్లో. టాలీవుడ్ లో అయినా కోలివుడ్ అయినా సరే ఆమె తో సినిమాలు చేసేందుకు ఎదురు చూసేవారు. అగ్ర దర్శకులకు ఆమె మొదటి ఆప్షన్ గా ఉండేవారు. అయితే చిన్న వయసులోనే విమాన ప్రమాదంలో మరణించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె స్నేహితురాలు ఆమని పలు కీలక విషయాలు చెప్పారు. సౌందర్య కష్టపడి పైకి వచ్చింది అన్నారు. కాని ఆమె కష్టపడినన్నీ రోజులు సుఖం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఆమె ఎంత సంపాదించినా దానిని అనుభవించే టైం ఆమెకు దొరకలేదని అన్నారు ఆమని. చివరకు తన సొంత బావను పెళ్లి చేసుకుని కూడా ఆమె కష్టాలు పడ్డారు అన్నారు.
జీవితాన్ని అనుభవించాలి అని భావించిన ఆమె విమాన ప్రమాదంలో మరణించారు అని తెలిపింది. సౌందర్య హెలీకాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినప్పుడు గర్భవతిగా ఉన్నారు. పెళ్లి అయిన ఏడాదిలోనే ఆమె మరణించారు. జీవితంలో కష్టపడి.. కావాల్సినంత పేరు ప్రఖ్యాతులతో పాటు కోట్లాది మంది అభిమానం సంపాదించుకున్నారని ఆస్తులు బాగా సంపాదించారు అని కాని దానిని అనుభవించి, సుఖపడే టైంకి లేకుండా పోయారని తెలిపారు.
Also Read: అభిమాన హీరో కోసం వెంకటేష్ ఏం చేసారో తెలుసా…?