తమిళ స్టార్ హీరో సూర్యకి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మంచి ఫాం లో ఉన్న సూర్య త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. మహేష్ బాబుతో సినిమా తర్వాత సూర్యతో త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు అనే ప్రచారం జరుగుతుంది. ఇక సూర్య త్వరలోనే రోలెక్స్ అనే భారీ బడ్జెట్ సినిమాలో నటించే అవకాశం ఉందని సమాచారం.
విక్రమ్ సినిమాలో సూర్య పాత్ర చివర్లో కనపడుతుంది. ఆ పాత్ర బాగా హిట్ అయింది. ఆ సినిమాకు అదే ప్రధాన బలం అని చెప్పాలి. ఖైదీ, విక్రమ్ సినిమాలకు రోలెక్స్ అనే పాత్ర విలన్ అనేది అర్ధమైంది. దీనితో ఖైదీ 2, విక్రమ్ సీక్వెల్ కోసం జనాలు ఎదురు చూస్తుంటే రోలెక్స్ సినిమా చేస్తా అని లోకేష్ కనగరాజ్ ప్రకటించాడు. ఈ నేపధ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే నెలలో ప్రకటన రానుంది.
ఇక ఇప్పుడు సూర్య చేసిన ఒక పని బాగా సంచలనం అయింది. అదేంటి అంటే… ముంబైలో ఒక భారీ ఫ్లాట్ కొన్నాడు సూర్య. ఆ ఫ్లాట్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వడమే. ఎంత కంటే 70 కోట్లు అని అంటున్నాయి సినీ వర్గాలు. 68 కోట్లు కాగా మరో రెండు కోట్లు ఖర్చులు అయ్యాయట. స్విమ్మింగ్ పూల్ థియేటర్ పార్కింగ్ స్పాట్ అన్నీ ఉన్నాయట. సూర్య ముంబై వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు.