అప్పట్లో హీరోయిన్లు కొందరు కెరీర్ ను సరిగా ప్లాన్ చేసుకోలేక ఇబ్బందులు పడినా మరికొందరు మాత్రం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళారు. అందులో కె ఆర్ విజయ కూడా ఒకరు. ఆమె అప్పట్లో బాగా ఫేమస్ హీరోయిన్. జెమిని గణేషన్ ప్రోత్సాహం తో సినిమాల్లోకి వచ్చిన ఆమె ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆకట్టుకున్నారు విజయ. స్టార్ హీరోలకు అమ్మగా కూడా చేసారు.
అప్పట్లో ఆమెను ఎన్టీఆర్ బాగా ప్రోత్సహించారు అని చెప్తూ ఉంటారు. దేవుడు సినిమాలు వస్తే అందులో అమ్మవారి పాత్రలు బాగా చేసేవారు కె ఆర్ విజయ. ఇదిలా ఉంచితే ఆమె బాగా రిచ్ అని చెప్తారు అప్పటి సినిమా జనాలు. మన తెలుగు నటులు శోభన్ బాబు, మురళి మోహన్ తరహాలోనే ఆమె కూడా బాగా భూముల మీద సంపాదన పెట్టారని అంటారు. అలా మద్రాస్ దగ్గరలో ఏకంగా 67 ఎకరాల్లో ఒక తోట కూడా కొన్నారట.
ఆమెకు నాలుగు ఎకరాల్లో ఒక భారీ ఇల్లు కూడా ఉండేది అని చెప్తారు. ఇక ఆ ఇంటి మీద హెలికాప్టర్ ఆగేది. ఆమె కుటుంబానికి సొంత హెలికాప్టర్ కూడా ఉంది అప్పట్లో. ఆమె ఇంట్లో ఉన్న వసతులు చూసి స్టార్ హీరోలు సైతం షాక్ అయ్యారట అప్పుడు. స్విమ్మింగ్ ఫూల్ తో పాటు పలు వసతులు ఉండేవి అప్పట్లో. ప్రస్తుతం కెఆర్ విజయ సినిమాలకు దూరంగా ఉన్నారు.