టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో శ్యాం ప్రసాద్ రెడ్డి ఒకరు. అగ్ర నిర్మాతగా ఎన్నో సినిమాలు చేసినా సరే ఆయన మాత్రం సైలెంట్ గా ఉంటారు. ఇక మల్లెమాల తో ఫాం లో ఉన్నా సరే ఇప్పుడు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరితో పడితే వాళ్ళతో చేయకుండా కథ తనకు నచ్చితే ఆలస్యం అయినా సరే సినిమాలు చేస్తున్నారు. అగ్ర హీరోలతో కూడా సినిమాలు ఆలోచిస్తున్నారు.
అంజి సినిమా ఇచ్చిన షాక్ తర్వాత ఆయన కాస్త బాధ పడ్డారు. మానసికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాని కోడి రామకృష్ణ దర్శకత్వంలో అరుంధతి సినిమా ఆయన రేంజ్ ను పెంచింది. ఆ తర్వాత కిక్ వంటి సినిమాలతో నిర్మాతగా నిలబడ్డారు. ఆయనకు చిరంజీవితో మంచి అనుబంధం ఉంది. కోడి రామకృష్ణతో ఎన్నో హిట్ సినిమాలు చేసిన శ్యాం ప్రసాద్ రెడ్డికి కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవితో చేయాలనే కోరిక ఉండేది.
అందుకోసం ఆయన చాలా మంచి కథలు కూడా కోడి రామకృష్ణతో మాట్లాడారు. చిరంజీవి తో డేట్స్ దొరికాక నేరుగా కోడి రామకృష్ణ ఇంటికి వెళ్లిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి మంచి గ్రాఫిక్స్ తో సినిమా చేయమని అడిగారట. గ్రాఫిక్స్ చాల ఖర్చుతో పని. సమయం కూడా ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది. అంజి సినిమా వద్దు అని చాలా మంది చెప్పినా సరే చిరంజీవి గారికి మాట ఇచ్చానని… ఎంత ఖర్చైనా సినిమా చేస్తా అని అంజి చేసారట. ఇందుకోసం విదేశాల్లో ఉన్న గ్రాఫిక్స్ నిపుణులను పిలిచి మరీ చేసారు. కాని ఆ సినిమా షాక్ ఇచ్చింది.