ఈ రోజుల్లో హీరో హీరోయిన్లకు మధ్య పెద్దగా స్నేహం ఉండటం లేదనే మాట వాస్తవం. ఎక్కడో ఒకరిద్దరు మినహా స్నేహం అనేది ఉండటం లేదు. ఇక కమర్షియల్ అంశాలు సినిమాలో ఎక్కువైన తర్వాత కాంబినేషన్ రిపీట్ చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదు. ఈ రోజుల్లో కాంబినేషన్ రిపీట్ కావడం అనేది గగనంగానే ఉంది. కాని గతంలో మాత్రం అలా ఉండేది కాదు అనే మాట వాస్తవం.
Also Read:శ్రీదేవి డబ్బింగ్ చెప్తుంటే ఎన్టీఆర్ ఏం అనేవారు…?
ఒకే హీరో, హీరోయిన్ చాలా సినిమాల్లో కలిసి నటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. హీరో, హీరోయిన్ మధ్య స్నేహం చాలా బాగుండేది. అన్నా చెల్లెళ్ళ మాదిరిగా ఉన్న వారు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో కొందరు ప్రేమలో కూడా పడ్డారు. అలా ప్రేమలో పడిన వాళ్ళ గురించి జనాలు కూడా ఆసక్తి చూపించే వారు. ఇలా కొందరు జీవితాలు కూడా నాశనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.
అలా నాశనం చేసుకున్న వారిలో అప్పటి హీరో హరినాథ్ కూడా ఒకరు అంటారు. ఆయన ఎక్కువ సినిమాలు చేసిన గీతాంజలి, కృష్ణ కుమారి వంటి వారితో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ వ్యవహారంతో మద్యానికి బానిస కావడం, సినిమాలకు దూరంగా ఉండటం జరిగింది. ఆయనకు అప్పటికే పెళ్లి జరిగినా సరే కృష్ణ కుమారితో ప్రేమలో పడ్డారు అని అంటారు జనాలు. ఈ ప్రేమ వ్యవహారం తర్వాత ఆయన కెరీర్ కూడా ఇబ్బందుల్లో పడింది.