తెలుగులో దిల్ రాజుకి నిర్మాతగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ ఉంటుంది. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదే సమయంలో వివాదాలు కూడా ఆయన్ను వెంటాడిన సందర్భాలు ఉన్నాయి. మొదటిసారి దిల్ రాజు కెరీర్ లో ఎప్పుడు లేని ఇబ్బందులు పడుతున్నారు.
దిల్ రాజుకి సరిగా థియేటర్ లు కూడా రావడం లేదనే టాక్ కూడా వినపడుతుంది. అగ్ర హీరోలతో సినిమాలు చేసి స్వేచ్చగా విడుదల చేసిన ఆయనకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి. తమిళ హీరో విజయ్ తో ఆయన వారసుడు అనే భారీ బడ్జెట్ సినిమా చేసారు. ఈ సినిమాకు వంశీ పైడపల్లి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా తమిళంలో బాగానే ఆడింది గాని తెలుగులో మాత్రం ఇబ్బంది పడింది అనే టాక్ ఉంది.
ముఖ్యంగా ఆ కథ తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో తెలుసు అని పలు సినిమాలను కలిపి ఒక సినిమా చేసారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ఈ సినిమాకు విజయ్ కు ఏకంగా వంద కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారు దిల్ రాజు. వంద కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న విజయ్ కనీసం తెలుగులో ప్రచారం చేయలేదు. కనీసం మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేయలేదు. అటు సోషల్ మీడియాలో కూడా పెద్దగా ప్రచారం చేసిన సందర్భం లేదు.