దర్శకుడు వంశీ సినిమాలు అనగానే మన కళ్ళ ముందు హీరోయిన్లు ఎక్కువగా కనపడతారు. వాళ్ళను ఆయన చాలా అందంగా చూపించడమే కాకుండా పాత్రలను చాలా అందంగా డిజైన్ చేస్తారు. ఈ క్రమంలో ఆయన భాను ప్రియ విషయంలో చాలా శ్రద్ధ చూపించి ఆమెకు ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ ఉందనే వార్తలు వచ్చాయి. దీనిపై ప్రముఖ కెమెరామెన్ ఎం వీ రఘు సంచలన విషయాలు చెప్పారు.
ఒక సినిమాలో హీరోయిన్ భానుప్రియకు మేకప్ ఎక్కువ కావడంతో తాను ఈ విషయం అందరి ముందు చెప్పడంతో వంశీ ఫీలయ్యారని అన్నారు. అప్పుడు భానుప్రియ కూడా హర్ట్ అయ్యారని వివరించారు. దీనికి కారణం ఏంటని ఆరా తీస్తే వారిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారన్న రూమర్ అప్పటికే ఉందని తెలిపారు. ముందు భానుప్రియను వంశీ ఇష్టపడటం.. ఆ తర్వాత తనకు కెరీర్ ఇచ్చాడని కృతజ్ఞతతో ఆమె కూడా కోపరేట్ చేసిందని తెలిపారు.
భానుప్రియ తో ప్రేమలో పడిన సమయానికే వంశీకి పెళ్లయిందన్నారు ఆయన. ఇదిలా ఉంటే అప్పట్లో ఉన్న టాక్ ప్రకారం ఆమెను పెళ్లి చేసుకునేందుకు వంశీ తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు రెడీ అయ్యారని అంటారు. కాని భానుప్రియ తల్లి మాత్రం అందుకు ఇష్టపడలేదని సమాచారం. ఇద్దరూ కెరీర్ పై పూర్తిగా దృష్టిపెట్టాలని… మీరు ఇలా ప్రేమలో పడితే మీ కెరీర్ నాశనం అవుతుందని వార్నింగ్ ఇచ్చారట.