అప్పట్లో హీరోయిన్ల మధ్య కాస్త కోల్డ్ వార్ జరిగేది అంటారు మన తెలుగులో. హీరోలు కూడా ఈ విషయంలో ఇబ్బంది పడేవారు అని అంటారు. ముఖ్యంగా అగ్ర హీరోయిన్ల మధ్య గొడవల పరిష్కారం కోసం చాలానే ట్రై చేసేవారు నిర్మాతలు. కాస్త హీరోయిన్ పాపులర్ అయితే చాలు ఆమె మీద కుట్రలు చేసేవారు అనే ప్రచారం జరిగేది. కాని అందరికి సమాన అవకాశాలు వచ్చేవి స్టార్ హీరోల సినిమాలు చేసేవారు.
కొందరు హీరోయిన్లు అయితే తాము అనుకున్న హీరోతోనే సినిమా చేసేవారు. ఇక విజయ నిర్మల, వాణి శ్రీ వంటి వారికి కాస్త పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా పరిస్థితి ఉండేది అంటారు. విజయ నిర్మల దర్శకత్వం వహించిన రెండు సినిమాల్లో వాణి శ్రీ నటించారు. అయితే ఒక సినిమా విషయంలో పారితోషికం ఇవ్వలేదు అనే ప్రచారం అప్పట్లో బాగా పాపులర్ అయింది. ఇది ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది.
వాణి శ్రీకి వ్యక్తిగత కార్యదర్శి ఒకరు ఉండేవారు. వాణి శ్రీ వ్యవహారాలన్నీ ఆమెనే చూసుకునేవారు. అయితే ఒక సినిమాకు డబ్బులు ఇవ్వలేదని ఆమె ప్రచారం చేయించారు. ఇక ఇది బయటకు వచ్చేసరికి… విజయ నిర్మల సినిమాలకు డబ్బులు ఇవ్వట్లేదని జనాల్లోకి వెళ్ళింది. మీడియా కూడా హడావుడి చేసింది. ఈ విషయం తెలిసిన విజయ నిర్మల… వాణి శ్రీ వద్దకు వెళ్ళారు. ఆమెను నిలదీసి అడిగే క్రమంలో గొడవ అయింది. వాస్తవానికి ఆ ప్రచారం వాణి శ్రీ కి తెలియదు. ఇలా గొడవ పెద్దది అయిపోయింది. చివరకు ఆ సినిమా నిర్మాత అయిన ఆది శేషగిరిరావు, హీరో కృష్ణ సమస్యను పరిష్కరించారు.