ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపించిన సందర్భాలు ఉన్నాయి. కాని ఇప్పుడు మాత్రం ఆయన పేరు వింటేనే కొందరు ఫైర్ అవుతున్నారు. అమితాబ్ లాంటి హీరో కి కూడా మర్చిపోలేని హిట్ ఇచ్చిన వర్మ… ఇప్పుడు అడల్ట్ సినిమాల మీదనే ఫోకస్ చేసాడు.
ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా కాస్త ఇబ్బందిగానే ఉన్నాయి. అమ్మాయిల విషయంలో ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్న వర్మ ఒకప్పుడు శ్రీదేవిని ఎలా ఇష్టపడ్డాడు అనేది తెలిసిందే. ఎవరిని అయినా ఏదైనా అనే వర్మ… శ్రీదేవి విషయంలో మాత్రం ఏ మాట మాట్లాడలేదు. ఆమెను ఇప్పటికీ ఒక దేవతలానే చూస్తా అని చెప్తూ ఉంటాడు వర్మ. అయితే ఆయన శ్రీదేవి కంటే ముందే మరో హీరోయిన్ ని ప్రేమించాడు.
ఆ హీరోయిన్ ఎవరో కాదు జయసుధ. ఆమెను వర్మ దాదాపు 12 ఏళ్ళ పాటు ప్రేమించాడు. అమరదీపం సినిమా పోస్టర్ ను ఆయన అలా చూస్తూ ఉండిపోయాడట. ఆ సినిమా కూడా చాలా సార్లు చూసిన వర్మ… ఆ తర్వాత రావు గారి ఇల్లు అనే సినిమాకు సహాయ దర్శకుడిగా కూడా చేసి… జయసుధకు డైలాగులు కూడా చెప్పాడు. మనీ మనీ సినిమా కోసం జయసుధ ఇంటికి వెళ్ళగా అప్పుడు ఆమె భర్త నితిన్ కపూర్ డోర్ ఓపెన్ చేయడంతో సైలెంట్ అయిపోయాడట.