టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ ఇప్పుడు కాస్త హిట్ కోసం ఎదురు చూస్తున్నారు అనే చెప్పాలి. ఆయన సినిమా ఎప్పుడు వస్తుందో కూడా క్లారిటీ ఉండటం లేదు అంటున్నారు కొందరు. అయితే వచ్చే సినిమాలతో మంచి హాస్యం పండిస్తున్నారు. ఎఫ్ 3 సినిమాలో ఆయన చేసిన కామెడి చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు సైంధవ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
నారప్ప సినిమా వెంకటేష్ కి కలిసి వచ్చినా అది అనుకున్న విధంగా హిట్ కాలేదు. పైగా ఓటీటీ లో విడుదల చేసారు. ఇక త్రివిక్రమ్ తో ఒక సినిమా చేసేందుకు కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఒక పక్కన చిరంజీవి, బాలకృష్ణ పోటీ పడి సినిమాలు చేస్తుంటే వెంకటేష్ మాత్రం స్లో అవుతున్నారు. ఇక వెబ్ సీరీస్ లో కూడా ఆయన నటిస్తున్నారు. రానా నాయుడు అనే వెబ్ సీరీస్ త్వరలో విడుదల కానుంది.
దీనికి సంబంధించిన ప్రమోషన్ కూడా భారీగానే చేస్తున్నారు. ఇదిలా ఉంచితే వెంకటేష్ ఇప్పుడు రెమ్యునరేషన్ పెంచాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆయన ఎఫ్ 3 సినిమా కోసం గాను 13 కోట్ల వరకు తీసుకున్నారు. ఇక ఇప్పుడు చేసే సినిమాకు 17 కోట్ల వరకు తీసుకుంటున్నారు అని టాక్ ఉంది. ఏది ఎలా ఉన్నా ఈ వయసులో వెంకటేష్ రెమ్యునరేషన్ పెంచడం హాట్ టాపిక్.