తెలుగు సినిమాలో కళ అనే మాట వినపడినన్ని రోజులు కె విశ్వనాథ్ పేరు వినపడుతూనే ఉంటుంది. సాధారణంగా సినిమాల్లో పాటలు అంటే హీరో హీరోయిన్ డాన్స్ వేయడం అనే భావనలో ఉండే ప్రేక్షకుల ఆలోచన మార్చేసారు ఆయన. సంగీత దర్శకుడు, డాన్స్ మాస్టర్ ఇలా ప్రతీ ఒక్కరు పాట కోసం రోజులు కాదు నెలలు సమయం తీసుకునే విధంగా పరిస్థితి మార్చేసారు కళా తపస్వి.
స్వాతి ముత్యం, శంకరా భరణం సినిమాల్లో ఆయన కళకు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే అర్ధమవుతుంది. స్టార్ నిర్మాతలు ఆయన మాట వినాల్సిందే సినిమా కోసం ఆలస్యం అయినా ఎదురు చూడాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. ఎలాంటి అగ్ర హీరో అయినా సరే ఆయనకు నచ్చే వరకు సినిమా చేయాల్సిందే అనేది వాస్తవం. ఇలా తన మార్క్ వేసారు విశ్వనాథ్. 50 కి పైగా సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.
అయితే ఆయనకు ఒక కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది అంటారు. అదేంటి అనేది ఒకసారి చూద్దాం. అన్నమయ్య సినిమాను చేయాలని ఆయన చాలా ఎదురు చూసి ఆ కథ కోసం పరిశోధనలు కూడా చేసారు. కథ పూర్తిగా సిద్ధమయ్యే సమయానికి అన్నమయ్య మీద మరో దర్శకుడు సినిమా చేయడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. ఇది ఆయనకు చిరకాల కోరిక అని కాని నెరవేరలేదు అంటారు.