మన తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా సరే సినిమాల్లో కాపీ సన్నివేశాల మీద కాస్త ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుంది. అగ్ర హీరోల సినిమాలు సూపర్ హిట్ అయితే కొందరు అందులోని లోపాలను వెతికే పనిలో ఉంటారు. మన తెలుగులో కొందరు దర్శకుల సినిమాల విషయంలో ఇదే జరుగుతుంది. త్రివిక్రమ్ సినిమాలను, రాజమౌళి సినిమాలను కొందరు డీప్ గా చూసి కాపీ సన్నివేశాలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఇలా హైలెట్ అయిన సీన్ విక్రమార్కుడు సినిమాలోనిది. విక్రమార్కుడు సినిమాలో రౌడీ కొడుకుకి పిచ్చి ఉందని కోర్టు తీర్పు ఇస్తుంది. ఆ తర్వాత నైట్ పార్టీ చేసుకుంటుంటే దానికి మినిస్టర్ రావడం, మినిస్టర్ కి సెక్యూరిటీ గా విక్రమ్ రాథోడ్ రాగా… ఆ రౌడీ కొడుకు పోలీస్ వాళ్ళతో ఒక ఆట ఆడతాడు. అదే ఆట హీరో వరకు రాగా… అది నచ్చని హీరో తన దగరికి రౌడీ పరుగెత్తుకుంటూ వస్తుంటే కింద బుల్లెట్స్ విసురుతాడు.
వాటిమీద కాలు వేసిన రౌడీ స్లీప్ అయి కిందపడి చనిపోవడం సినిమాకు హైలెట్ అవుతుంది. అయితే ఈ సినిమా విజయశాంతి సినిమాలోని సీన్ అని చర్చ నడుస్తుంది. దీనిపై రాజమౌళి కూడా క్లారిటీ ఇచ్చారు. శాంభవి ఐపిఎస్ అనే సినిమాలోని సన్నివేశం అని… ఆ సీన్ నచ్చి తాను తీసుకున్నాను అని వివరించారు. ఆ సినిమాకు కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచయిత.