ఇప్పుడు టాలీవుడ్ లో కొందరి హీరోలకు అద్రుష్టం బాగా కలిసి వస్తుంది అనే చెప్పాలి. అందులో యువ హీరో అడవి శేష్ ఒకరు. ఆయన నటించిన సినిమాలు అన్నీ ఈ మధ్య కాలంలో మంచి హిట్ కొడుతున్నాయి. అయితే అడవి శేష్ దర్శకుడిగా మారాలని చూస్తున్నారని ఇక నుంచి తన సినిమాలను తానే నిర్మించుకుని డైరెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి.
ఇక ఇదిలా ఉంచితే అడవి శేష్ అసలు సినిమాల్లోకి రావడానికి కారణం ఎవరు అనేది చాలా మందికి తెలియదు. ఎవరు ఏంటీ అనేది చూద్దాం. అడవి శేష్ ని బాగా ఎంకరేజ్ చేసి సినిమాల్లోకి తీసుకొచ్చింది ఆయన సోదరుడు సాయి కిరణ్ అడవి. ఆయన ఎవరో కాదు మంచి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్. 2008లో సొంతగా కథ రాసుకుని వినాయకుడు అనే సినిమాను చేసి హిట్ కొట్టారు.
ఆ తర్వాత విలేజ్ లో వినాయకుడు అనే సినిమా కూడా ఆయనకు మంచి హిట్ ఇచ్చింది. కేరింత, కిస్ వంటి సినిమాలతో హిట్ లు కొట్టాడు. ఇక కథలు సొంతగా రాసుకోవడమే కాకుండా తన సినిమాలకు తానే నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలా అడవి శేష్ ని కూడా ఎంకరేజ్ చేసి కథల్లో కూడా హెల్ప్ చేసారు. త్వరలోనే ఆయన నాగ చైతన్య హీరోగా కూడా సినిమా చేయనున్నారు అని టాక్.