పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయనకు ఉన్న క్రేజ్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ ను రెండు సినిమాలు మలుపు తిప్పాయి. అందులో మొదటిది తొలిప్రేమ కాగా రెండవది గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ సినిమా 2012లో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది.
వరుస ప్లాపులతో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో డూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ ముందు వరకు పవన్ ఇంక సినిమాలు చేయకపోతే బెటర్ అని చాలామంది అన్నారు.కానీ ఒక్క సినిమాతో వారందరికీ మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు పవన్ కళ్యాణ్.
చిరు చేస్తానన్న సినిమాను వెంకీ చేశాడట!! చివరికి పోలీసు కేసు కూడా
ఇదిలా ఉండగా చాలావరకు సినిమాలలో దర్శకులు 10, 15 సెకన్ల పాటు కనిపిస్తూ ఉంటారు. అంతకన్నా ఎక్కువ అయితే ఎక్కడా కనిపించరు. అలాగే పవన్ సినిమాలో కూడా డైరెక్టర్ హరీష్ శంకర్ నటించారు. అయితే అది ఒక సెకండ్ మాత్రమే.
ఫ్లాప్ సినిమాలను హిట్ చేయగల స్టామినా వాళ్లకే సొంతం!!
కెవ్వు కేక సాంగ్ తర్వాత పవన్ కళ్యాణ్ కు విలన్ కు ఓ డిస్కషన్ అవుతుంది. అక్కడ ఓ డైలాగ్ తర్వాత వచ్చే సీన్ లో హరీష్ కనిపిస్తారు. కానీ అది హరీష్ శంకర్ అని ఎవరికీ తెలీదు. ఆయన కూడా ఎక్కడా ఆ విషయం చెప్పలేదు. దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియలేదు. కానీ ఇప్పుడు గమనిస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపడతారు.