సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అతడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. అలాగే నాజర్, రాజీవ్ కనకాల, సోనూసూద్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమాను జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై మురళీమోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే ఆ తర్వాత జయభేరి ఆర్ట్స్ వారు సినిమాలను నిర్మించలేదు. ఇదే విషయంపై మురళీమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి క్యాన్సల్ అయ్యేవరకు అంత జరిగిందా ?
అతడు సినిమా రిలీజ్ సమయానికి రాజకీయాల్లో బిజీగా ఉన్నానని రియల్ ఎస్టేట్ లో తమ్ముడు, కొడుకు ఉన్నారని అన్నారు. అయినప్పటికీ జయభేరి సంస్థలో మేము చేసిన సినిమాలలో అతడు సినిమా పెద్ద బడ్జెట్ సినిమా అని అన్నారు.
నిజానికి ఎప్పుడూ కూడా చిన్న బడ్జెట్ సినిమాలే చేసే వాళ్ళమని అది కూడా ఎంతో మంచి పేరును, లాభాలను తీసుకువచ్చాయని అన్నారు. త్వరలో మళ్ళీ జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాలు చేస్తానని అన్నారు.
రాజమౌళి సినిమాలో ఉన్న కామన్ పాయింట్ ఎంత మంది గమనించారు ? ఇప్పుడు RRR లో కూడా ఉందా ???
మరోవైపు రాజకీయాల గురించి మాట్లాడుతూ మొదట రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేను అనుకున్నది ఇప్పుడు సాధించలేక పోయానని అన్నారు. చిన్నప్పటి నుంచి నాకు దేవుడు భక్తి ఎక్కువ అని టిటిడి చైర్మన్ గా చేయాలని అనుకున్నానని కానీ వీలుపడలేదు అని అన్నారు. ఇప్పటికీ కూడా ప్రతిరోజు గంటన్నరకు పైగా పూజా కార్యక్రమాలు చేస్తానని చెప్పుకొచ్చారు. పూజ చేయకుండా ఇంటి నుంచి బయటకు కూడా వెళ్లనన్నారు మురళి మోహన్.