ఏంటి.. జూనియర్ ఎన్టీఆర్ సీరియల్‌లో నటించాడా..? ఇదెప్పుడు జరిగింది అని చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే అలాంటి స్టార్ హీరో సీరియల్ చేయడం అంటే మాటలు కాదు. అయితే ఇదంతా జరిగి కొన్నేళ్లవుతుంది. ఈయన సినిమాలలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు ఓ సీరియల్‌లో నటించాడు. అది కూడా చాలా మందికి తెలియదు.
గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం సినిమాలో రాముడిగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత మూడేళ్ళకు హీరో అయ్యాడు తారక్. ఇదంతా ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ చిన్నపుడే ఓ సీరియల్ చేసాడు. దాని పేరు భక్త మార్కండేయ. ఈ సీరియల్ గురించి చాలా మందికి కనీసం ఐడియా కూడా లేదు.
ఈటీవీ మొదలు పెట్టిన కొత్తలో ఈ సీరియల్ వచ్చింది. చాలా తక్కువ రోజులే ప్రసారమైంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మార్కండేయుడిగా నటించాడు. శివ భక్తుడిగా అందరి మనసులు గెలుచుకున్నాడు. ఎన్టీఆర్ ఈ గెటప్‌లో ఉన్నప్పటి ఫోటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయినా జూనియర్ ఎన్టీఆర్‌కు బుల్లితెర కొత్తేం కాదు.
సీరియల్ చేసిన తర్వాత బిగ్ బాస్ అంటూ మరోసారి ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఆ తరువాత ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ వచ్చాడు. సినిమాలతో పాటు బుల్లితెరను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.