నందమూరి బాలకృష్ణ చేసే సినిమాలు అంటే ఆయన ఫాన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన చేసిన అఖండ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది. ఈ సినిమా తర్వాత బాలయ్య చేసే సినిమాల విషయంలో దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక బాలయ్య కెరీర్ లో ఎన్నో సినిమాలు చేయాల్సి ఉన్నా సరే వచ్చిన ఆఫర్ లను కాదని వేరే వాళ్లకు ఇచ్చేసారు ఆయన.
Also Read:సెకండ్ సాంగ్ పై మరో అప్డేట్ ఇచ్చిన థమన్ – సర్కారు వారు సిద్ధం
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ అనే మళయాళ రీమేక్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. ఏపీలో టికెట్ ధరలు తక్కువగానే ఉన్నా సరే ఈ సినిమా బాగానే వసూలు చేసింది. వాస్తవానికి ఈ సినిమాను ముందుగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో తీసుకొచ్చే ఆలోచన చేసారు. కాని బాలయ్య మాత్రం వద్దంటే వద్దు అనడం తో మరో ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ ను ఎంపిక చేసారు.
ఇక పవన్ కళ్యాణ్ హీరోగా భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన అన్నవరం సినిమాను ముందు బాలయ్య కోసం అనుకున్నారు దర్శకుడు. కాని ఆ కథ ఏ మాత్రం బాలయ్యకు నచ్చలేదు. దీనితో మరో ఆలోచన లేకుండా పవన్ వద్దకు వెళ్తే ఆయన నో అనలేదు. అయితే ఈ సినిమా ఫలితం మాత్రం దర్శక నిర్మాతలతో పాటుగా పవన్ కళ్యాణ్ ను సైతం బాగా ఇబ్బంది పెట్టింది. అలాగే వెంకటేష్ హీరోగా వచ్చిన నాగవల్లి సినిమా కథ కూడా బాలయ్యను అడిగితే వద్దన్నారు. ఇక సింహరాశి సినిమా విషయంలో ముందు బాలయ్యను అనుకున్నా సరే ఆయన వద్దు అనడంతో రాజశేఖర్ చేసారు.