సినిమా సినిమాకు తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని దశదిశలా వ్యాపింప జేస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. బాహుబలి ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించాడు. బాలీవుడ్ హీరోలు సైతం ఇప్పుడు రాజమౌళితో సినిమా చేయాలని ఆశపడుతున్నారు.
ఇప్పటివరకు కెరీర్లో ఫ్లాప్ అంటే ఏంటో తెలియని దర్శకుడిగా రాజమౌళికి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో ఎవరు అనేది కాదు హిట్ మాత్రం పక్కా అన్నట్టుగా రాజమౌళి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒకే ఒక సీరియల్ అదే ! ఇది ఎప్పుడు వచ్చిందంటే ?
ఇదిలా ఉండగా రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా సినిమా ఇండస్ట్రీ లోనే ఉన్నారు. ఇప్పటికే ఆకాశవాణి సినిమాను నిర్మించాడు. అంతేకాదు గతేడాది కార్తికేయ వివాహం కూడా చేసుకున్నాడు.
అతడు సినిమాలో నటించిన ఈ బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా? హీరో కి మించి…!
తన స్నేహితురాలు పూజా ప్రసాద్ ని వివాహం చేసుకున్నాడు. అయితే రాజమౌళి కొడుకు పెళ్లి చేసుకున్న పూజా ప్రసాద్ టాలీవుడ్ స్టార్ జగపతి బాబు కుటుంబ సభ్యురాలట. ఈ విషయం చాలా మందికి తెలీదు.
ఒకానొక సమయంలో టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా నటిస్తున్నాడు. ఇక జగపతి బాబు మేన కోడలు పూజా ప్రసాద్ సింగర్ కూడా. ఇక ప్రస్తుతం రాజమౌళి చేస్తున్న సినిమాలకు సంబంధించిన పనులను భర్త తో దగ్గరుండి చూసుకుంటున్నారు పూజా ప్రసాద్.