దిగ్గజ దర్శకుడు దివంగత కె విశ్వనాథ్. ఆయన సినిమాలంటే చాలు అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. స్టార్ హీరోలు అయితే ఆయనతో ఒక్క సినిమా చేసినా చాలు అనుకునేవాళ్లు. కళను బాగా ఇష్టపడే ఆయన సినిమాల్లో ప్రతీ పాట విషయంలో ఒకటికి పది సార్లు జాగ్రత్తలు తీసుకునే వారు. సహాయ దర్శకుడిని నమ్మి సినిమా వదిలేసేవారు కాదు. చిన్న హీరోతో సినిమా చేసినా సరే ఆయనే అన్నీ చూసుకునేవారు.
సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు ఆదరణ ఉండేది. పాటల్లో సాహిత్యం కూడా చాలా అర్ధవంతంగా ఉంటుంది. అయితే ఆయన దర్శకత్వం వహించిన ఒక సినిమా మాత్రం విడుదలకు నోచుకోలేదు అప్పుడు. ఆ సినిమా ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. సిరిమువ్వల సింహనాదం అనే సినిమాను కె విశ్వనాథ్ ఎంతో జాగ్రత్తగా డైరెక్ట్ చేసారు. మాధవి మాల ఈ సినిమాలో చాలా బాగా నటించారు.
కళకు ఎక్కువ ప్రాధాన్యత ఉండే సినిమా. ఒక నటుడు స్త్రీ వేషాలు వేస్తూ జీవితంలో ముందుకు వెళ్ళడం, అతని కష్టాలు అన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. కాని ఈ సినిమా మాత్రం విడుదల కాలేదు. ఈ సినిమాను చాలా మందికి చూపించారు విశ్వనాథ్. ఇక యూట్యూబ్ వచ్చిన తర్వాత సినిమా రీల్స్ ని డిజిటలైజ్ చేసి విడుదల చేయాలని చూసారు. చాలా మంది ట్రై చేసినా అది సాధ్యం కాలేదు.