మనం వాడే గ్యాడ్జేట్స్ లో మనకు తెలియని ఆసక్తికర విషయాలు ఉంటాయి. అందులో కొన్ని విలువైన లోహాలు కూడా ఉన్నాయి. బంగారం, వెండి, ప్లాటినం వంటివి ఉన్నాయి. ఐఫోన్లో దాదాపుగా 0.034 గ్రా బంగారం ఉంటుంది. అలాగే 0.34 గ్రా వెండి ఉంటే 0.015 గ్రా పల్లాడియం, ఒక గ్రాము ప్లాటినంలో వెయ్యి వంతు కంటే తక్కువగా ఉంటుంది.
Also Read:దేశానికి బీజేపీ ప్రమాదకరంగా మారింది….!
కంప్యూటర్లో గ్రాములో 1/5వ వంతు లేదా దాదాపు 1000 రూపాయల విలువైన బంగారం ఉంటుందని అంచనా వేసారు. ల్యాప్ టాప్ లలో సాధారణంగా ఒక గ్రాము బంగారంలో 1/10వ వంతు లేదంటే దాదాపు 500 రూపాయల విలువలో బంగారం ఉంటుంది. మన ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్‌లో ఉండే విలువైన లోహం కేవలం బంగారం మాత్రమే కాకుండా… మరిన్ని విలువైన లోహాలు ఉన్నాయి.
సర్క్యూట్ బోర్డ్‌లు, కంప్యూటర్ చిప్స్, కీబోర్డ్ పొరలు మరియు కొన్ని కెపాసిటర్లు వంటి వాటిల్లో వెండి ఉంటుంది. హార్డ్ డ్రైవ్‌లు, సర్క్యూట్ బోర్డ్ భాగాలలో ప్లాటీనం ఉంటుంది. హార్డ్ డ్రైవ్‌లు, సర్క్యూట్ బోర్డ్ భాగాలు (కెపాసిటర్లు) వంటి వాటిల్లో పల్లాడియం వాడతారు. ఇక కాపర్ ను సిపీయూ హీట్ సింక్లు, వైరింగ్ లేదా కేబుల్స్, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్‌లు, కంప్యూటర్ చిప్స్ లో వాడతారు.
సర్క్యూట్ బోర్డ్ భాగాలలో నికెల్ ను ఉపయోగిస్తారు. టాంటాలమ్ ను సర్క్యూట్ బోర్డ్ భాగాలలో ఉపయోగించడం జరుగుతుంది. కోబాల్ట్ ను హార్డ్ డ్రైవ్‌లలో అల్యూమినియంను ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్‌లు, కంప్యూటర్ చిప్స్, హార్డ్ డ్రైవ్‌లు, సీపీయూ హీట్ సింక్‌లలో వాడతారు. టిన్, జింక్, నియోడైమియం వంటి లోహాలను కూడా వాడతారు.