చాలా మంది హీరోలు తమ దగ్గరకు వచ్చిన కథలను నచ్చక రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఆ కథలతో వేరే హీరోలు మాత్రం సూపర్ డూపర్ హిట్స్ ని అందుకుంటూ ఉంటారు. అలా తెలుగు ఇండస్ట్రీలో చాలానే జరిగాయి. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వదిలేసిన చాలా కథలతో రవితేజ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇంతకీ ఎన్టీఆర్ వదిలేసిన ఆ సినిమాలేంటి? రవితేజ కు హిట్ ఇచ్చిన ఆ డైరెక్టర్స్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటిగా భద్ర… బోయపాటి శ్రీను దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు రైటర్ గా కొరటాల శివ, వంశీపైడిపల్లి చేశారు. అయితే ఈ సినిమా కథ మొదటిగా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళిందట. జూనియర్ ఎన్టీఆర్ సున్నితంగా రిజెక్ట్ చేసాడట. ఆ తర్వాత అల్లు అర్జున్ దగ్గరికి తీసుకు వెళ్లారట మేకర్స్. ఆయన కూడా రిజెక్ట్ చేయడంతో చివరిగా రవితేజ చేతిలో పడింది.
ఎన్టీఆర్ కు రాజేంద్ర ప్రసాద్ ఏమవుతారు…? రాజేంద్ర ప్రసాద్ కామెడి సినిమాలు చేయడానికి కారణం ఎవరూ…?
రవితేజ మాత్రం ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన మీరజాస్మిన్ హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.
RRR లో నటించే అవకాశాన్ని కోల్పోయిన ఈ ఇద్దరు హీరోయిన్స్ ఎవరో తెలుసా ?
ఇక మరో సినిమా కిక్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కథ మొదటిగా ప్రభాస్ దగ్గరికి వెళ్లిందట. ప్రభాస్ నో చెప్పడంతో ఆ కథను జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పాడట డైరెక్టర్. జూనియర్ ఎన్టీఆర్ కూడా రిజక్ట్ చేయడంతో రవితేజ చేతిలోకి వెళ్ళింది. రవితేజ మాత్రం ఈ సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు.
ఇక మూడవ చిత్రం కృష్ణ. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదట ఎన్టీఆర్ తో చేయాలనుకున్నారు మేకర్స్. కత్తి అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారట. కానీ జూనియర్ ఎన్టీఆర్ కు నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాడు.
ఆ తర్వాత వి.వి.వినాయక్ టైటిల్ ని మార్చి రవితేజతో సినిమా తీసి హిట్ కొట్టేశాడు. ఇలా జూనియర్ ఎన్టీఆర్ వదులుకున్న ఈ మూడు సినిమాలు రవితేజ కు స్టార్డమ్ ను తీసుకు వచ్చాయి.