భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అలాగే ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ధోనీ చిత్రం గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ధోని క్రికెటర్ కాకముందు రైల్వే టికెట్ కలెక్టర్ గా పని చేస్తూ కనిపిస్తాడు. రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి స్టార్ క్రికెటర్ ధోనీ ఎలా ఎదిగాడు. అనేది ఈ చిత్రంలో చూపించారు మేకర్స్.
అయితే ఒక్క ధోనీనే కాదు… ఇలా చాలా మంది క్రికెటర్స్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ఎన్నో కష్టాలు పడి స్టార్ క్రికెటర్స్ గా మారారు. వేరు వేరు ఉద్యోగాలు చేస్తూ కూడా క్రికెట్ పై పట్టు వదల్లేదు.
అక్కినేని నాగ చైతన్య వదులుకున్న హిట్ ఫ్లాప్ సినిమాలు ఇవే !!
మొదటిగా షేన్ బాండ్… న్యూజిలాండ్ కి చెందిన ఈ క్రికెటర్ అప్పట్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే బాండ్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ట్రాఫిక్ పోలీస్ గా పనిచేశాడు. ఆ తర్వాత క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెనకడుగు వేయలేదు.
జూనియర్ ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఒకే ఒక సీరియల్ అదే ! ఇది ఎప్పుడు వచ్చిందంటే ?
ఇక మరో క్రికెటర్ షెల్డన్ కాట్రెల్. షెల్డన్ క్రికెటర్ కాకముందు క్రికెట్ గ్రౌండ్ కు కాపలా ఉండేవాడు. ఆ తర్వాత అదే మైదానంలో క్రికెట్ ఆడి అందరి ప్రేమాభిమానాలు పొందాడు. ఇక మరో క్రికెటర్ మిచెల్ జాన్సన్.. జాన్సన్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ఒక ట్రక్ డ్రైవర్ గా పని చేసేవాడట. ఆ తర్వాత క్రికెట్ లోకి వచ్చి స్టార్ బౌలర్ గా ఎదిగాడు.
మరో క్రికెటర్ లియోన్… లియోన్ క్రికెటర్ కాకముందు గ్రౌండ్ మ్యాన్ గా పనిచేసేవారట. ఆ తర్వాత క్రికెటర్ గా మారాడు. అలాగే బ్రాడ్ హడ్జ్… ఈయన క్రికెటర్ కాకముందు ఒక పెట్రోల్ బంక్ లో పని చేశాడట. ఆ తర్వాత క్రికెటర్ గా మారి ఎంతో మంది ప్రేమాభిమానాలు పొందాడు.
అలాగే మరో స్టార్ క్రికెటర్ మార్నస్ లాబుస్చాగ్నే… ఈయన క్రికెట్ లోకి రాకముందు ఓ ఛానల్ లో పనిచేసే వాడు. ఆ తర్వాత క్రికెటర్ గా మారిపోయాడు. అలాగే టీమిండియా క్రికెటర్ చాహల్. క్రికెటర్ కాకముందు చాహల్ చెస్ ఆడేవాడు. యూత్ లెవెల్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం కూడా వహించాడు.
Advertisements
ఇక ఆఖరిగా సౌత్ఆఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్. మిస్టర్ 360గా పేరు సంపాదించుకున్న ఏబీ డివిలియర్స్ క్రికెట్ లోకి రాకముందు అండర్ నైన్టీన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా ఆడే వాడు. అంతేకాకుండా దక్షిణ ఆఫ్రికా జాతీయ హాకీ జట్టులో కూడా ఎంపిక కావడం మరో గమనించదగ్గ విషయం. వీరే కాదు చాలా మంది క్రికెటర్స్ కాకముందు వేరు వేరు ఉద్యోగాలు చేస్తూ… పట్టుదలతో సాధించి మంచి స్థాయికి వచ్చారు.