సినిమా పరిశ్రమలో… కొన్ని కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఒక సినిమాలో హీరోగా చేసిన వాళ్ళు మరో సినిమాలో ఏ పాత్ర అయినా చేసే అవకాశం ఉంది. ఒక సినిమాలో హీరో పక్కన హీరోయిన్ గా చేసిన వాళ్ళు మరో సినిమాలో హీరోకి తల్లిగా లేదా చెల్లిగా నటించే అవకాశం ఉంటుంది. అలాంటి పాత్రల విషయంలో అభిమానులు అభ్యంతరం చెప్పినా వాళ్ళు మాత్రం నటనతో మెప్పిస్తారు.
Also Read:నవీన్ ఘటనపై ప్రధాని విచారం
ఇలా హీరో పక్కన హీరోయిన్ గా ఆ తర్వాత తల్లిగా చేసిన వాళ్ళను చూస్తే…
భానుమతి
ఎన్టీఆర్ తో కలిసి ఆమె మల్లీశ్వరి, తోడు నీడ వంటి సినిమాల్లో నటించారు. ఆ తర్వాత సామ్రాట్ అశోక్ సినిమాలో ఎన్టీఆర్ కు తల్లిగా నటించారు.
శారద
సూపర్ స్టార్ కృష్ణ తో కలిసి ఆమె నాలుగు సినిమాల్లో నటించారు. కాని ఆ తర్వాత రౌడీ నెంబర్ 1, అగ్నిపర్వతం వంటి సినిమాల్లో కృష్ణకు తల్లిగా నటించారు.
అంజలీ దేవి
అక్కినేనితో కలిసి భక్త తుకారాం, సువర్ణ సుందరి వంటి సినిమాల్లో నటించారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఆయనకు తల్లిగా నటించారు.
వరలక్ష్మీ
ఎన్టీఆర్ తో కలిసి ఆమె… మూడు సినిమాల్లో నటించి ఆ తర్వాత దాదాపు అయిదు సినిమాల్లో ఎన్టీఆర్ కు తల్లిగా నటించారు.
జయసుధ
చిరంజీవి తో కలిసి రెండు సినిమాల్లో నటించిన జయసుధ ఆ తర్వాత చిరంజీవికి తల్లిగా నటించారు.
సుజాత
చిరంజీవి, సుజాత కలిసి రెండు సినిమాలు చేసి ఆ తర్వాత అన్నా చెల్లెలు సినిమాలో ఆయనకు సుజాత చెల్లిగా చేసారు. బిగ్ బాస్ సినిమాలో తల్లిగా నటించారు.
Also Read:మా ఉసురు తగులుద్ది..!