బెంగాలీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు ప్రస్తావనకు రాగానే తెలుగు ఆడియెన్స్‌కి గుర్తుకొచ్చే పేరు ‘సీతారామం’. అందులో సీత పాత్రలో కనిపించిన మృణాల్ ఠాకూర్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందం, అభినయం కలగలిసిన ఈ బెంగాలీ ముద్దుగుమ్మను చూసిన తెలుగు ఆడియెన్స్ క్లీన్ బౌల్డ్ అయిపోయారు.
ఇప్పుడు టాలీవుడ్‌లో ఆమె అదే క్రేజ్‌తో నాని హీరోగా నటిస్తున్న సినిమాలో చాన్స్ దక్కించుకుంది. మొదటిగా సీరియల్స్ ద్వారా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 2014లో మరాఠీ సినిమా ‘విట్టి దండు’తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అనంతరం పలు చిత్రాల్లో ఆమె నటించినా.. పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.
అయితే 2018లో విడుదలైన హిందీ చిత్రం ‘సూపర్ 30’తో మాత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్ దక్కించుకుంది. ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘ధమాకా’, ‘జెర్సీ’ మూవీస్‌తో తన నటనకు గానూ మంచి మార్కులు పడ్డాయి.
అలాగే 2022లో తెలుగులో రిలీజైన ‘సీతారామం’తో మృణాల్ ఠాకూర్.. దేశవ్యాప్తంగా సూపర్బ్ క్రేజ్ సాధించింది. ఇక ఇప్పుడు హిందీలో 5 చిత్రాల్లో నటిస్తోంది మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు కుర్రకారులో పిచ్చ ఫాలోయింగ్ సాధించడమే కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ‘సీత’గా మరింత దగ్గరైంది.